అభిమానం చూపించడం పలు రకాలు. దీనికి ఒక నిర్వచనమంటూ ఏదీ లేదు. ఎవరికి తోచిన రీతిలో వారి వారి అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి గ్రామంలో ఒక మందిరం కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు రవీందర్.
తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన దేవుడిగా కేసీఆర్ కు తన ఇంటి ఆవరణలో పాలరాతి విగ్రహాన్ని కట్టించాడు రవీందర్. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికీ రాకపోవడంతో రవీందర్ దంపతులే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ADVERTISEMENT
అభిమానమంతా బాగానే ఉంది కానీ, విగ్రహం మాదిరి ఇంత శాంతంగా కేసీఆర్ ఎప్పుడు కూర్చొన్నారా… అని నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు. ఎవరికైనా గుర్తుకు వస్తే చెప్పేయొచ్చు మరి!
ADVERTISEMENT



