హాట్ టెన్నిస్ బ్యూటీ అవాక్కయ్యేలా చేసింది!

Maria Sharapova caught on drugs testటెన్నిస్ రంగంలో మారియా షరపోవా అంటే తెలియని వారుండరు. ఒక్క టెన్నిస్ ఆటతోనే కాదు, మోడలింగ్ రంగంలో టాప్ లెస్ ఫోజులు, బికినీలు, ఫోటోషూట్లతో తన అందాలు బహిర్గతపరిచి సంచలనం సృష్టించింది. అలాంటి మారియా షరపోవా ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా జరిపిన డ్రగ్ పరీక్షల్లో షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియంను వాడినట్లు తేలింది. డోపింగ్ లో పట్టుబడ్డ విషయాన్ని స్వయంగా షరపోవానే లాస్ యాంజిల్స్ లో వెల్లడించింది.

“డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యా, దీనికి పూర్తి బాధ్యత నాదే, చాలా పెద్ద తప్పు చేశా, అభిమానుల మనసులను గాయపరిచా, నాలుగేళ్ల వయసు నుంచి టెన్నిస్ ఆడుతున్నా, టెన్నిస్ ను ఎంతో ప్రేమించా, మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా” అంటూ తన ఏమోషనల్ అయిన ఈ రష్యా బ్యూటీపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించేందుకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఇలా చేయడంపై అభిమానులు అవాక్కవుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ పర్యవసానాలు అప్పుడే షరపోవాను తాకడం ప్రారంభమయ్యాయి. షరపోవా ‘బ్రాండ్ అంబాసిడర్’గా వహిస్తున్న క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘నైక్,’ షరపోవాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన చేసింది. డోపింగ్ వార్తలు వాస్తవమే అంటూ షరపోవా ప్రకటించిన కొద్ది గంటల్లోనే నైక్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మున్ముందు ఆమె కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయం అంటున్నారు క్రీడా పండితులు.

ADVERTISEMENT
Latest Stories