ప్రమాదం నుండి బయటపడ్డ ప్రముఖ క్రికెటర్!

Matthew Hayden spinal injuries while surfing in Queenslandఆస్ట్రేలియా ఓపెనర్ గా పలు రికార్డులను సొంతం చేసుకున్న ఎడమ చేతి బ్యాట్స్ మెన్ మాథ్యూ హెడెన్ ఓ పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. క్రికెట్ నుండి రిటైర్ అయిపోయిన హెడెన్ ప్రస్తుతం కామెంటరీలు చెప్పుకుంటూ కాలం వేలిబుచ్చుతున్నాడు. తాజాగా ఫ్యామిలీతో కలిసి క్వీన్స్ ల్యాండ్ వెళ్ళిన హెడెన్, అక్కడ సర్ఫింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు.

[m9ad]

ADVERTISEMENT

46 ఏళ్ళ హెడెన్, అతని కొడుకుతో కలిసి ఐల్యాండ్ లో సర్ఫింగ్ చేస్తుండగా, ప్రమాదానికి గురై తల బొటుకు తగిలింది. పెనుప్రమాదం నుండి బయటపడిన హెడెన్ ను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, నెక్ దగ్గర ప్రమాదం జరిగినట్లుగా గుర్తించిన వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హెడెన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

ADVERTISEMENT
Latest Stories