Telugu

మావిగన్‌కి వైసీపీకి ఫిక్స్! ఆంధ్రాకు మహోపకారమే!

గతంలో మూడు రాజధానులు, విశాఖ రాజధాని విషయంలో వైసీపీ ఎంత ధృడంగా, నమ్మకంగా మాట్లాడేదో మళ్ళీ ఇప్పుడు ‘మావిగన్‌ రాజధాని’ విషయంలో కూడా అంతేధృడంగా, నమ్మకంగా మాట్లాడుతుండటం చాలా శుభపరిణామమే.

తాడేపల్లి ప్యాలస్‌, పులివెందుల ప్యాలస్‌, ఇంకా రాష్ట్రంలో కొన్ని చోట్ల వైసీపీ కార్యాలయాల ముందు ‘మవిగన్ రాజధాని’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం మొదటి నుంచి అమరావతి రాజధాని అని చెప్తోంది. నేటికీ దానికే కట్టుబడి చకచకా నిర్మాణ పనులు చేయిస్తోంది. ఇంతకాలం రాజధాని విషయంలో సందిగ్ధంలో ఉన్న వైసీపీకి కూడా ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది. వైసీపీ ఇప్పుడు ‘మావిగన్‌ రాజధాని’కి కట్టుబడినట్లు అర్ధమవుతోంది.

రాజధాని విషయంలో అధికార, ప్రతిపక్షాలకు ఇంత క్లారిటీ ఉండటం మంచిదే. చాలా అవసరమే!

కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మించి చూపి ప్రజలను ఓట్లు అడగబోతుంటే, వైసీపీ ‘మావిగన్‌ రాజధాని’ పేరుతో ఓట్లు అడగాల్సి ఉంటుంది. అప్పుడు ప్రజలే అమరావతా? మావిగనా? తేల్చుకుంటారు.

అయితే ఏపీ రాజధాని విషయంలో ఇన్నిమార్లు మాట తప్పి, మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి, కనీసం ఇప్పుడైనా ‘మావిగన్‌’కు కట్టుబడి ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా… కూటమి ప్రభుత్వానికి మహోపకారం చేసినవారవుతారు.

ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూటమిని గెలిపించే బాధ్యత ఆయనే తీసుకుంటున్నారు కనుక ఒకవేళ కూటమి సొంత బలంతో గెలిచినా ఆ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మరిచిపోకూడదు.

కానీ ఒక్క షరతు: వచ్చే ఎన్నికల వరకు జగన్‌ ‘మావిగన్‌ రాజధాని’ని మరిచిపోకుండా గుర్తుచేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

7 minutes ago

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…

10 minutes ago