పోన్లే కనీసం ఆ రకంగా నిర్మాతకి సేఫ్!

Mega family blame game on boyapati sreenu మన సినిమా పరిశ్రమలో ఎలా ఉంటుంది అంటే, అదేదో సినిమాలో చెప్పినట్లు “పచ్చడైపోయిన సినిమాను ప్రెస్ మీట్ లో పొగిడేస్తారు” అని అదే క్రమంలో సినిమా ఎలా ఉన్నా సక్సెస్ మీట్ లు పెట్టి నిండా మునిగిన నిర్మాతను మరో అడుగు కిందకు నెట్టేస్తారు. అయితే వినయ విధేయ రామ విషయంలో మాత్రం పాపం నిర్మాతను బ్రతికించారు మెగా ఫామిలీ. అదెలా అంటారా, ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది.

విషయం ఏంటి అంటే, సహజంగా మెగా ఫామిలీ హీరోల సినిమాలను మన మెగాస్టార్ ఒక స్పెషల్ షో వేయించుకుని చూసి, దానిపై ఆయన తన ఒపీనియన్ చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. కానీ. వినయ విధేయ రామ విషయంలో అలా జరగలేదు, పైగా కనీసం సక్సెస్ మీట్ కూడా పెట్టలేదు. సినిమా ఫస్ట్ షో తోనే మ్యాటర్ అర్ధం అయిపోవడంతో భాద్యత, తప్పు మొత్తం దర్శకుడిపై తోసేసి పక్కకు తప్పుకున్నారు మెగా ఫామిలీ, కనీసం మళ్ళీ బోయపాటి వైపు తొంగి చూసే ఆలోచన కూడా చెయ్యలేదు.

ADVERTISEMENT

అయితే ఈ మ్యాటర్ మొత్తంలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే, సక్సెస్ మీట్ లు, సక్సెస్ టూర్ లు అంటూ హంగామా చెయ్యకపోవడం వల్ల పాపం నిర్మాతలు మిగిలిన ఆ నాలుగు రాళ్ళూ సేఫ్ అనే చెప్పాలి. ఈ విషయంలో మెగా ఫామిలీ ని అభినందించాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories