మహేష్ నిర్ణయంతో ముగ్గురు మెగా హీరోలు ఖుషీ!

mahesh-babu-Brahmotsavamప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” సినిమా ఏప్రిల్ నుండి మేకు వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్ లో జరుగుతున్న జాప్యంతో కంగారుగా కాకుండా కాస్త స్థిమితంగా విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం సినిమాను మే చివరి వారంలో విడుదల చేయనున్నారని వార్తలు హల్చల్ చేసాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31వ తేదీన విడుదల చేస్తారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. మే 31వ తేదీ సోమవారం వచ్చిన దరిమిలా, ఏ సినిమా కూడా వారం ప్రారంభంలో విడుదల చేయడం జరగదు. దీంతో ఇవన్నీ గాసిప్ రాయుళ్ళ ప్రతిభలేనని ధృవీకరణ అయ్యింది.

అయితే, ఒక్క “బ్రహ్మోత్సవం” వాయిదాతో ముగ్గురు మెగా హీరోలు ఖుషీగా ఉన్నారు. ఏప్రిల్ 8న విడుదల కానున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” హవాకు ఎటువంటి డోకా లేకుండా పోగా, ప్రిన్స్ బుక్ చేసుకున్న ఏప్రిల్ 29వ తేదీన అల్లు అర్జున్ తన “సరైనోడు”ని దింపాలని డిసైడ్ అయ్యారట. దీంతో సరైన విడుదల తేదీ కోసం వేచిచూస్తున్న బన్నీకి ప్రిన్స్ సరైన దారి కల్పించినట్లయింది. తాజాగా ఏప్రిల్ బరిలో మరో మెగా హీరో కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యాడు.

ADVERTISEMENT

‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరం తేజ్ నటించిన “సుప్రీమ్” సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయ్యారట. “బ్రహ్మోత్సవం” వెనక్కి తగ్గడం కలిసి వచ్చే అంశం కావడంతో పాటు, “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా టికెట్లు లభించని వారిని ఆకట్టుకునేందుకు మరో మెగా హీరో అదే సమయంలో వస్తే లాభిస్తుందన్న ఆలోచనలతో “సుప్రీమ్”ను సమ్మర్ కానుకగా ఏప్రిల్ బరిలో దించుతున్నారు దిల్ రాజు. మొత్తానికి మహేష్ నిర్ణయం ముగ్గురి మెగా హీరోలకు సానుకూలంగా మారిందన్న మాట.

ADVERTISEMENT
Latest Stories