పేద అభిమాని కూతురి పెళ్ళికి చెక్ పంపిన చిరంజీవి

Megastar Chiranjeevi donated one lakh rupees to his fan B Shekar daughter marriage మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి తో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా పేరొందాడు. తన స్థాయికి మించి రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో శేఖర్ ఎప్పుడు ముందు ఉండేవాడు. ఇటీవలే అతని పెద్ద అమ్మాయి వర్ష పెళ్లి కుదిరింది.

డిసెంబర్ 19 న వివాహం జరగనుండగా, శేఖర్ ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి పెళ్లికి 1,00,000/- ఆర్ధిక సాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతుల మీదుగా ఆ చెక్ అభిమానులు శేఖర్ కు అప్పగించారు. రక్త సంబంధీకులు చేయని సహాయం చిరంజీవి గారు చేసారు ఏమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేనిది అని శేఖర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ADVERTISEMENT

పెళ్లి తరువాత నూతన వధూవరులను హైదరాబాద్ తీసుకుని రమ్మని శేఖర్ కు చెప్పినట్టు సమాచారం. తనను ఎంతగానో ప్రోత్సహించిన అభిమానుల పట్ల విశేషంగా శ్రద్ధ చూపుతూ ఉంటారు చిరంజీవి. వారి బాగోగులు తరచు తెలుసుకుని అవసరమైనప్పుడు సహాయం చేస్తారు. దానికి ఈ ఉదంతం మరో ఉదాహరణ.

మరోవైపు… నిహారిక వివాహానికి హాజరై హైదరాబాద్ తిరిగివచ్చిన చిరంజీవి… ఈ నెల 12 నుండి తిరిగి ఆచార్య షూటింగ్ లో పాల్గొంటారు. వివాహానికి వెళ్లే ముందు చిత్రం క్లైమాక్స్ లో వచ్చే కీలక ఫైట్ … చిరంజీవి, సోనూ సూద్ ల మీద చిత్రీకరించారు. ఆచార్య వచ్చే ఏడాది వేసవికి విడుదల అవుతుంది

ADVERTISEMENT
Latest Stories