
వినడానికి అంతంతమాత్రంగానే ఉందని ఇప్పటికే ఈ పాటపై శ్రోతలు పెదవి విరవగా, వీడియో ద్వారా వీక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ మేకింగ్ వీడియోను విడుదల చేసినట్లున్నారు. కేవలం మెగాస్టార్ డ్యాన్స్ ల మీద ఫోకస్ చేస్తూనే పబ్లిసిటీ ఇవ్వడం విచిత్రంగా ఉంది. చిరు స్టెప్పులు ఇరగదీస్తారన్న విషయాన్ని ఏదో కొత్తగా నిరూపించుకోవాల్సి వచ్చిన మాదిరి ఈ పబ్లిసిటీ ఉండడం విశేషం. ఈ వయసులోనూ డ్యాన్స్ ల విషయంలో తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల పలు స్టేజ్ లపైన స్టెప్పులు వేసి నిరూపించుకున్నారు.
మరి అలాంటి చిరంజీవి సినిమాను డ్యాన్స్ స్టెప్పులతో పబ్లిసిటీ చేయించాలనుకోవడం ప్రణాళిక లోపమే అనుకోవాలి. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా కాబట్టి, ప్రేక్షకుల ఆసక్తి రీత్యా ‘ఖైదీ నంబర్ 150’ హల్చల్ చేస్తోంది గానీ, పబ్లిసిటీ లోపం బాగా కనపడుతోందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాలో విషయం లేదన్నట్లుగా మెగాస్టార్ స్టెప్పులపై ఫోకస్ చేయడం ఎంతవరకు సమంజసమో చిత్ర యూనిటే ఆలోచించుకోవాలి.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…