లైఫ్ ఇస్తే..లైట్ అంటావా…?

Mehrene Kaur Pirzada tweets on f2 movie successయువ హీరోల సరసన చక్కగా ఒదిగిపోయి నటిస్తున్న హీరోయిన్ మెహ్రీన్ కి రాక రాక ఏడాదికి ఒక్కటంటే ఒక్క హిట్ వచ్చింది. అదీ మామూలు హిట్ కాదు…సూపర్ డూపర్ హిట్. కానీ మెహ్రీన్ కి మాత్రం ఇది చాలా చిన్న హిట్ అట.

అదేంటి అంటే, ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ చిన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. కట్ చేస్తే ఆ ట్వీట్ పై ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా ఏడాది నుంచి మెహ్రీన్ కి హిట్ లేదు. పైగా ఒక హిట్ కోసం ఎదురు చూస్తూ ఉంది మెహ్రీన్. ఇంకా చెప్పాలి అంటే, మెహ్రీన్ కి ఈ హిట్ లేకపోతే ప్యాక్ అప్ చెప్పేసే పరిస్థితి. కానీ అదృష్టం వాళ్ళ ఈ భారీ హిట్ లభించింది.

ADVERTISEMENT

ఈ హిట్ తో మెహ్రీన్ మరో పది సినిమాల వరకూ చూసుకొనవసరం లేదు. పైగా ఈ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. మరి అలాంటి హిట్ ని మరీ అంట చులకనగా ‘చిన్న హిట్’అంటూ ప్రస్తావించడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటో ఆమెకే తెలియాలి.

ఏది ఏమైనా వెంకీ, అందరితో కలసి థియేటర్స్ లో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు అని చెప్పవచ్చు

ADVERTISEMENT
Latest Stories