
ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయిర్ లియోనల్ మెస్సి భారత పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం కోల్కత్తా స్టేడియం లో సందడి చేసారు. అయితే ఆయనను చూడడానికి తమ విలువైన సమయం, డబ్బు వెచ్చించామని, అయితే అందుకు తగ్గ అనుభూతిని పొందలేకపోయామంటూ స్టేడియం లో అభిమానులు బాటిల్స్ విసిరేసి, కుర్చీలు విరిచేసి తమ అసహనాని, తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
అయితే సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఆ అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ హైద్రాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నారు. పొద్దున్న జరిగిన చేదు ఘటనలను గమనించిన తెలంగాణ అధికారులు హైద్రాబాద్ లో మెస్సి షెడ్యూల్ ని, స్టేడియం లో ఆయన గడిపే సమయాన్ని ముందుగానే ప్రకటించి అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా సమకూర్చారు.
తమ అభిమాన ఆటగాడిని ఎప్పుడెప్పు చూద్దామా అని ఒక అభిమానులు, మరో పక్క సెలబ్రెటీలు వేచి చూస్తున్నారు. అలాగే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సి తో ఆడే ఫుట్ బాల్ మ్యాచ్ ని తిలకించేందుకు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు.
మెస్సి తో రేవంత్ అంటూ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ నానా హంగామా చేస్తుంటే, మరో పక్క తమకు ఓటేసి అధికారాన్ని ఇచ్చిన ప్రజలను పట్టించుకోకుండా రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుకుంటున్నాడు అంటూ బిఆర్ఎస్ కాంగ్ర్రెస్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టింది.
అలాగే టి. బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా కాకుండా ఒక ఈవెంట్ మేనేజర్ మాదిరి అనవసర ప్రచారాలు చేస్తుకుంటూ, ఈవెంట్లు నిర్వహించుకుంటూ వేల కోట్ల ప్రజా దానిని వృధా చేస్తున్నారు అంటూ రేవంత్ పై మాటల యుద్ధం సాగిస్తున్నారు.
ఇక మరికొంతమంది మాత్రం మెస్సి – రేవంత్ మ్యాచ్ కోసం వస్తున్న వారి భద్రతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యుడని, కార్యక్రమం సాఫీగా సజావుగా జరిగేలా చూసుకోవడం ముఖ్యమంటూ సలహాలు సూచనలు చేస్తున్నారు. ఇలా మిస్సి రాకతో ఎవరి గోలలో వారున్నారు.
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…