మైఖేల్ స్థాయికి తగ్గ బయోపిక్ కాదిది..

Michael Movie Review: Fans Disappointed by Biopic End

పాప్ సాంగ్ కల్చర్ తెలిసినవాళ్ళకి, జీవితంలో ఒక్కసారి కూడా పాప్ సాంగ్ అనేది వినని వాళ్లకి కూడా సుపరిచితమైన పేరు మైఖేల్ జాక్సన్. సింగర్ గా, మ్యుజీషియన్ గా, రైటర్ గా మైఖేల్ ఖ్యాతికి కొలమానం అంటూ లేదు. ప్రపంచ సంగీత పరిశ్రమ మీద అతడు వేసిన మార్క్ అనేది ఇంకో వందేళ్ల తర్వాత కూడా మాట్లాడుకుంటారు.

అలాంటి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పాప్ స్టార్ బయోపిక్ వస్తుంది అంటే, కచ్చితంగా అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అందులోనూ మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ ప్లే చేయడం, టీజర్-ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు, సంగీత అభిమానులు “మైఖేల్” సినిమా కోసం కాస్త సీరియస్ గానే ఎదురుచూశారు.

ADVERTISEMENT

కట్ చేస్తే.. అఫీషియల్ రిలీజ్ కంటే ముందు ప్రీమియర్స్ కే నెగిటివ్ రివ్యూలు రావడం, రోటెన్ టమోటాస్ లాంటి ప్రఖ్యాత సంస్థ వెబ్ సైట్ లో మరీ దారుణంగా 27% రేటింగ్ రావడం అనేది చర్చనీయాంశం అయ్యింది. అయినప్పటికీ.. మరీ అంత బ్యాడ్ ఉండదులే అనుకున్నారు జనాలు.

అయితే నిన్న ఇండియన్ ప్రీమియర్స్ చూసినవాళ్లలో చాలామంది రోటెన్ టామెటోస్ రేటింగ్ తో ఎగ్రీ అవుతున్నారు. క్యాస్టింగ్, ప్రొడక్షన్, ఆర్ట్ & కాస్ట్యూమ్స్ వంటివి బాగున్నా.. కథనంగా అలరించలేకపోయింది. మరీ ముఖ్యంగా.. మోస్ట్ పాపులర్ డేంజరస్ సాంగ్ లైవ్ పెర్ఫార్మన్స్ తో సినిమా ముగించడం అనేది తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడే కదా సినిమా మొదలైంది, అప్పుడే “హిజ్ జర్నీ కంటిన్యూస్” అంటూ ఎండ్ చేయడం అనేది చాలామందికి నచ్చలేదు.

మరి ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందా లేక కావాలనే ఇలా ఎండ్ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ.. కాకపోతే మైఖేల్ జాక్సన్ లాంటి పాపులర్ పాప్ స్టార్ బయోపిక్ ఇలా అర్ధాంతరంగా, సంతృప్తినివ్వకుండా ముగియడం అనేది ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది.

ADVERTISEMENT
Latest Stories