
ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లు జగన్ చేసిన మాయలు భవిష్యత్ తరాన్ని తాకాయి. నాడు నేడు అంటూ ప్రభుత్వ పాఠశాలలకు సైతం వైసీపీ రంగులు అద్ది, జగనన్న నామజపం తప్ప మరో కార్యక్రమం లేదు అనేలా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ చూసిన ముఖ్యమంత్రి ఫోటోలు తగిలించి వైసీపీ రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా పాలన సాగించారు.
అలాగే విద్యార్థులకు అందించే స్కూల్ బ్యాగ్, బెల్ట్ ల మీద జగన్ గారి బొమ్మలు, చివరికి విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాల మీద, వారు తినే చిక్కి ప్యాకేట్ల మీద కూడా జగన్ బొమ్మలను ముద్రించిన ‘పబ్లిసిటీ స్టార్’ గా జగన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
మేనమామ అంటూ మాయ మాటలు చెప్పుకున్న జగన్, ఆ పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేయాల్సింది పోయి తన పార్టీకి రాజకీయ మార్గం వేసుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్, జగన్ మాదిరి మామయ్య అంటూ మాయ మాటలు చెప్పడం కాకుండా మంత్రిగా తన బాధ్యతను చిత్త శుద్ధిగా నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీట్ ను ఏర్పాటు చేసిన లోకేష్ తన హయాంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన హర్షించదగ్గ మార్పులను వివరించారు. అందులో ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాల, వారికీ అందించే రిపోర్ట్ కార్డుల మీద రాజకీయ నాయకుల బొమ్మలను తొలగించారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాన భోజన పథకానికి గాను డొక్కా సీతమ్మ పేరును ఖరారు చేసారు. అలాగే స్కూల్స్ లో ప్రభుత్వం తరుపున విద్యార్థులకు అందించే కిట్లను డాక్టర్. సర్వేపల్లి రాధా కృష్ణ పేరు మీద పంపిణి చేయడం జరుగుతుంది అంటూ భవిష్యత్ తరానికి పథకాల రూపంలో మన చరిత్ర ను ఆవిష్కరిస్తున్నారు.
అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ టీచర్లు అంటే చదువులు చెప్పాలే కానీ మరుగుదొడ్ల దగ్గర, భోజనాల దగ్గర ఫోటోలు తీయడం కాదు అని ఆ కార్యక్రమానికి వెంటనే స్వస్తి పలికాం. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే నిర్వహించిన మెగా డిఎస్సి తో విద్యార్థులకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతాం అంటూ హామీ ఇచ్చారు.
అలాగే విద్యార్థి దశ నుండే డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో తెలియ చేసి భవిష్యత్ తరాన్ని వాటి బారిన పడకుండా చూడవలసిన బాధ్యత అటు ప్రభుత్వంతో పాటుగా ఇటు తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు ఉందని గుర్తు చేసారు. అలాగే డ్రగ్స్ నిర్ములనకు తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అంటూ ముందుకొచ్చిన జగన్ దాన్ని సరైన పద్దతిలో తీర్చిదిద్దక పోవడం, ట్యాబ్ ల రూపంలో విద్యార్థులకు సోషల్ మీడియాను అరచేతికి అందించడం, బై జ్యుస్ విద్యా అంటూ వేలకోట్లు వెనకేసుకోవడం జగన్ మాయలలో ఒక భాగమే.
దీనితో మామయ్య అంటూ మాయ మాటలు చెప్పి మోసం చెయ్యడం కాదు మంత్రిగా ఆ వ్యవస్థ ప్రక్షాళనకు అవసరమైన మార్పులు తీసుకురావడం అభినందనీయం అంటున్నారు విద్యార్థుల తల్లితండ్రులు.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…