పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించింది నిజమే – రోజా

MLA roja on Pawan Kalyan Gundu Controversyబండ్ల గణేష్ తో ఇటీవలే జరిగిన వివాదం వాళ్ళ కావొచ్చు మరొకటి కావొచ్చు, వైకాపా ఎమ్మెల్యే రోజా పూర్తిగా పవన్ కళ్యాణ్, జనసేనలకు వ్యతిరేకంగా మారిపోయారు. ఆమె సహజ శైలిలో ఆ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర 400 కోట్ల ప్యాకేజీ తీసుకుని తెలుగు దేశం తొత్తులాగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.

అదే విధంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పరిటాల రవి గుండు వివాదం గురించి కూడా స్పందించారు రోజా. అప్పట్లో తెలుగు దేశం పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించడం నిజమే అని, అదే విధంగా 2014లోనూ కొట్టించారని, 2019లో కొట్టించడానికి సిద్ధంగా ఉన్నారని రోజా ఎద్దేవా చేసారు.

ADVERTISEMENT

అదే క్రమంలో రోజా పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకున్నాను అని చెప్పిన సమయం, తమ్ముడు సినిమా సమయం మ్యాచ్ కావడం లేదని ఆమె అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయిన కాపులు 2019లో మోసపోరని, వారు ఇప్పుడు పూర్తిగా వైకాపా వైపు చూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories