ఏ విషయంలో అయినా మంచి, చెడు రెండు నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాగ ఉంటాయి. అయితే సమాజం పై పెరుగుతున్న ఈ టెక్నాలజీ ప్రభావం కూడా మంచి, చెడు అనే రెండు కోణాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ల విషయంలో నేటి సమాజం ఎక్కువ ప్రభావితం అవుతుంది.
చేతిలో సెల్ పట్టుకుంటే చుట్టుపక్కన ఉన్న వారిని సైతం పట్టించుకోకుండా వాటిలో అంతర్లీనంగా మునిగిపోయే వారిని నిత్యం మన చుట్టూ పక్కల చూస్తూనే ఉంటాం. లోకం తో మాకేం పని అన్నట్టుగా వారి గోలలో వారు మునిగిపోతున్నారు.
ఇందుకు చిన్న పెద్ద అనే వయసు వ్యత్యాసం ఏమి లేదనే చెప్పాలి. ఈవీరికి అవసరమైన కంటెంట్ వారికి అందుబాటులో ఉంచుతూ నిత్యం తోటి వారికి దూరంగా తనకు తానూ దగ్గర ఉండే విధంగా సెల్ ఫోన్ మషులను తన ఆధీనంలోకి తెచ్చేసుకుతుంది.
యూ ట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్స్ అప్ అంటూ గంటల కొద్దీ సమయాన్ని ఒంటరిగా సెల్ ఫోన్ కి అప్పగించేస్తుంది నేటి యువత. ఇక ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో అంటూ అవసరం లేకున్నా ఆన్ లైన్ షాపింగ్ అంటూ ఫోన్లు పట్టుకుని వేలాడేవారు మరికొందరు.
ఇక యూ ట్యూబ్ షార్ట్స్ , ఇన్ స్టార్ రీల్స్ చేస్తూ కొందరు బిజీగా గడుపుతుంటే, వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ లైక్, షేర్ అంటూ మరికొందరు బిజీ అయిపోతున్నారు. పిల్లలకు కావాల్సిన చిట్టి చిలకమ్మ, జానీ జానీ నుంచి పండు ముసలి వాళ్ళకి కావాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకు అన్నిటికి ఒకటే మందు సెల్ ఫోన్.
అలాగే ఒకప్పుడు గ్రూప్ స్టడీస్ అంటూ ఒక పదిమంది విద్యార్థులు ఒక చోట చేరి కలిసి చదువుకొనే వారు, ఒకరి డౌట్స్ మరొకరు తీరుస్తూ ఒకరి నాలెడ్జ్ మరొకరు పంచుకుంటూ సరదాగా జ్ఞానాన్ని సంపాధించుకునే వారు. కానీ నేడు ఒక్క బటన్ నొక్కితే మనకు కావాల్సిన సమాచారం క్షణాలలో మన కళ్ళ ముందు సాక్ష్యాత్కారం అవుతుంది.
ఉపాధ్యాయులనో, తోటి స్నేహితులనే అడిగి తెలుసుకొనే రోజులు పోయి చాట్ జీపిటి, పర్ ప్లెక్సిటీ, జెమిని అంటూ ప్రపంచ జ్ఞానం అరచేతిలో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఒకప్పుడు ఇరుగు పొరుగు వారితో కలిసి రోడ్ల మీద, వీధులలో ఆడుకునే ఆటలకు బదులు ఇప్పుడు సెల్ ఫోన్ లోనే ఎవరో తెలియని వారితో కలిసి ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నారు.
ఇలా ప్రతి విషయంలోనూ నేటి సమాజం ఇతరుల పై ఆధారపడి అవకాశం లేకుండా సెల్ ఫోన్ లోనే తన ప్రపంచాన్ని చూస్తున్నాడు, అవసరమైన జ్ఞానాన్ని పొందుతున్నాడు, అయితే ఇది ఒక రకంగా మంచి ఫలితాలనిచ్చిన మరోరకంగా చూస్తే సమాజంలో వ్యక్తులను ఒంటరి వాడిగా మార్చేస్తుంది.







