మోహన్ బాబుకు…కాస్త మాట్లాడటం నేర్పండయ్యా!

Mohan-Babu-At-NTR-Audio-Launchఎన్టీఆర్ కి వీర భక్తుడుగా చెప్పుకునే మోహన్ బాబు..ఈరోజు జరిగిన ఎన్టీఆర్ ఆడియో వేడుకలో భాగం అయ్యారు..సంతోషం! అయితే ఎన్టీఆర్ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని వివరించిన ఆయన..ఎన్టీఆర్ తన సినిమా మేజర్ చంద్రకాంత్ ను గుర్తు చేసుకుని పొంగి పోయారు.

[m9ad]

ADVERTISEMENT

అంతవరకూ బాగానే ఉంది కానీ..చివర్లో మాత్రం యధావిధిగా నోరు జారేసాడు మంచు ‘బాబు’. ఈ సినిమా దర్శకుడు క్రిష్ ని అభినందించే క్రమంలో “తప్పుడు మనుషులను మంచి వారి లాగా చూపించావో…లేక తప్పుడు మనుషులను తప్పుడుగానే చూపించావో” తెలీదు అంటూ మోహన్ బాబు తన వక్ర బుద్దిని మరోమారు బయట పెట్టేశాడు.

అయితే అందరికీ తెలిసిందే మోహన్ బాబు ఆ మధ్య వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి బందువు అయ్యాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు జగన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నాడు. పలుమార్లు జగన్ సీఎం అయితే బావుంటుంది అని తెలిపాడు కూడా.

అయితే ఎంత వైకాపా పార్టీకి మద్దతుగా నిలిస్తే మాత్రం..ఎంత వైఎస్ఆర్ కుటుంబానికి బందువు అయితే మాత్రం సభా మర్యాద పాటించకుండా..అలా మాట్లాడటం ఎంతవరకూ సబబో…ఆయనకే తెలియాలి.

ఏది ఏమైనా..నేను ‘డైలాగ్ కింగ్’ ను అంటూ డప్పులు కొట్టుకునే మోహన్ బాబు గారు…కాస్త వేదికలపై గౌరవంగా మాట్లాడటం నేర్చుకుంటే ఎంతో మంచిది.

ADVERTISEMENT
Latest Stories