ఆన్ లైన్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్!

Mohan Babu Son of india pre booking recordఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలవడంతో మంచు మోహన్ బాబు పేరు ప్రధానంగా వినపడుతోంది. అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా… రెండింటిలోనూ హల్చల్ చేస్తోన్న ‘కలెక్షన్ కింగ్’ నామం, తాజాగా మరోసారి సందడి చేస్తోంది. ఈ సారి సినిమా పరంగానే మంచు వారి హంగామా ఉంది.

చాలాకాలం విరామం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన “సన్నాఫ్ ఇండియా” సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ బుకింగ్స్ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. గత రెండు రోజులుగా ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా ఆన్ లైన్ టికెట్ల బుకింగ్స్ పై సోషల్ మీడియాలో మరో సినిమా రన్ అవుతోంది.

ADVERTISEMENT

మునుపెన్నడూ లేని రీతిలో కేవలం పదుల సంఖ్యలో ఈ సినిమా ఆన్ లైన్ టికెట్లు బుక్ కావడం అనేది అంచనాలకందని విషయం. మోహన్ బాబు ఏమీ కొత్త నటులు కాదు, ఓ లెజెండరీ యాక్టర్ అని ఇటీవల తాడేపల్లిలో జగన్ నివాసానికి విచ్చేసిన సమయంలో ‘మా’ ప్రెసిడెంట్ గా వ్యవహారిస్తోన్న మంచు విష్ణు సైతం తెలిపారు.

ఇటీవల కాలంలో కొత్త కొత్త నటులు కూడా బాక్సాఫీస్ వద్ద “డీజే” వాయించేస్తున్న తరుణంలో, ‘కలెక్షన్ కింగ్’ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ లేకపోవడం అనేది పబ్లిసిటీ లోపమా? ప్రేక్షకులకు ఆసక్తిని పెంచే విధంగా టీజర్, ట్రైలర్స్ ను కట్ చేయడంలో చిత్ర యూనిట్ చూపించిన అలసత్వం అనుకోవాలా? లేక ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ వేదికగా జరిగిన పరిణామాల ఫలితామా?

ముందుగా పబ్లిసిటీ విషయానికి వస్తే ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. చిరునే ఓ పబ్లిసిటీ కాగా, అది జరిగి చాలా నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ‘సన్నాఫ్ ఇండియా’ పేరు ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేయడంలో చిత్ర యూనిట్ విఫలమైందనే చెప్పవచ్చు. అందులోనూ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో మోహన్ బాబును మరీ ఓవర్ గా చూపించారన్న టాక్ ప్రేక్షకుల నుండి వ్యక్తమయింది.

అలా ఆడియన్స్ ను తమ సినిమా వైపుకు తిప్పుకోవడంలో మోహన్ బాబు అండ్ కో పూర్తిగా విఫలమైంది. అలాగే ఇటీవల మీడియా వేదికలుగా ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలు కూడా ‘సన్నాఫ్ ఇండియా’ పబ్లిసిటీకి కాకుండా, మోహన్ బాబు చెప్పిన ఇతర అంశాలకు ప్రాధాన్యత లభించి అవి హైలైట్ అయ్యాయి. దీంతో ‘సన్నాఫ్ ఇండియా’ ప్రేక్షకులకు బహు దూరంగా జరిగింది.

ఇక ‘మా’ ప్రెసిడెంట్ ఎన్నికల నుండి నిత్యం ఏదొక రూపేణా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. బయట ఎన్ని జరిగినా సినిమా బాగుంటే ఏ ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాలను ఆదరించే ఘనచరిత్ర మన తెలుగు ప్రేక్షకులది. కనుక సినిమాయేతర అంశాలు ఈ సినిమా దారుణ ఓపెనింగ్స్ కు కారణమవుతాయని చెప్పలేం.

కానీ చిరంజీవిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా మంచు ఫ్యామిలీ చేస్తోన్న వ్యాఖ్యల పట్ల మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఒకింత గుర్రుగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఇవాళ్టి రోజుల్లో ట్రైలర్ నచ్చితే ఏ హీరో, ఏ భాష అన్న తారతమ్యం లేకుండా సినిమాలు హిట్టవుతున్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్ దారుణంగా ఉన్నా, ఆఫ్ లైన్ బుకింగ్స్ లో పుంజుకుంటుందేమో చూడాలి.

ఇంతకీ ఈ “సన్నాఫ్ ఇండియా” సినిమా కధాంశం ఏమిటంటే… ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ బస్సులు… ఇలా దేశంలో చాలా వరకు ప్రైవేట్ గా సదుపాయాలు ఉన్నట్టే, “ప్రైవేట్ జైళ్లు” కూడా ఉండాలనే సరికొత్త కాన్సెప్ట్ ను ఇందులో మంచు మోహన్ బాబు చెప్పబోతున్నారట. ఈ విషయం ఒకానొక ఇంటర్వ్యూలో స్వయంగా ‘కలెక్షన్ కింగ్’ వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories