
తెలంగాణ రాజకీయాలతో పాటుగా ఏపీ రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన పై రెండు రాష్ట్ర రాజకీయాలలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. బిఆర్ఎస్ కు చెందిన రోహిత్ రెడ్డి నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ నీడలు కలకలం సృష్టిస్తున్నాయి.
అయితే ఈ పార్టీలో టీడీపీ కి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పడ్డుబడడంతో పాటుగా ఆయనకు చేసిన డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ రావడంతో వెంటనే టీడీపీ అధిష్టానం అతని పై క్రమశిక్షణ చర్యల కింద పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది.
ఈ మేరకు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక అధికారిక ప్రకటన జారీ చేసారు. అయితే టీడీపీ తన పార్టీ నేత పై వెంటనే చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి బిఆర్ఎస్ అధిష్టానం వైపుకి మళ్ళింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్స్ కేసు ను బిఆర్ఎస్ చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
డ్రగ్స్ పై మా ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుంది అంటూ నాడు నానా హంగామా చేసిన బిఆర్ఎస్ ఇప్పుడు తమ పార్టీ నేతే ఫామ్ హౌస్ పార్టీల పేరుతో డ్రగ్స్ దందా కు పాల్పడితే ఇది ప్రభుత్వ కుట్ర అంటూ బిఆర్ఎస్ సదరు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన రోహిత్ రెడ్డిని సమర్ధించడం బిఆర్ఎస్ రాజకీయ నైతికతను ప్రశ్నిస్తుంది.
ఒకపక్క అధికార పార్టీలో ఎంపీ గా ఉన్న వ్యక్తి పై టీడీపీ తక్షణమే చర్యలకు ఆదేశిస్తే మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ను వెనకేసుకురావడంతో టీడీపీ అధిష్టానానికి బిఆర్ఎస్ అధినాయకత్వానికి ఎంత రాజకీయ వ్యత్యాసం అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
రాజకీయాలలో ఉండే నేతలు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలా డ్రగ్స్ అంటూ కొందరు, మహిళలతో లైంగిక సంబంధాలు అంటూ మరికొందరు తమను తాము బజారుని పెట్టుకుంటూ, పార్టీ పరువు – ప్రతిష్టతను కూడా దిగజారుస్తున్నారు.
రాజకీయాలలో విలువలు అంటూ చెప్పుకోవడం అంటే ఇలా అడ్డంగా దొరికిపోయాక కూడా ప్రభుత్వాల కుట్ర, ప్రతిపక్షాల ట్రాప్, మార్పింగ్, AI వీడియో లంటూ నేతలు తప్పించుకోవాలని చూడడం, పార్టీ అధిష్టానం వారి తప్పులను కప్పిపుచ్చాలని భావించడం హీనమైన చర్య అవుతుంది.
అయితే బిఆర్ఎస్ చేస్తున్న ఈ కప్పిపుచ్చుకునే చర్యలు రేపటి రోజున అధికార కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలుగా మారే అవకాశం లేకపోలేదు. ఉగాది తరువాత జరగబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదాంతం కాంగ్రెస్ చేతికి అస్త్రాలనిచ్చినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా…
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…