సనాతన మార్గంలో మరిన్ని త్యాగాలు… పవన్‌ సిద్దమేనా?

పవన్‌ కళ్యాణ్‌ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు… వాటన్నిటినీ ఎంతో నిబ్బరంగా అధిగమించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, గుర్తింపు ఏర్పరచుకున్నారు.

వాటినే పునాదిగా చేసుకొని జనసేనతో రాజకీయ జీవితం ప్రారంభించారు. మళ్ళీ ఆ ప్రస్థానంలో కూడా అనేక ఆటుపోట్లు భరించాల్సి వచ్చింది.

ADVERTISEMENT

అయినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, తగ్గాల్సిన చోట మాత్రమే తగ్గుతూ నెగ్గాల్సిన చోట నెగ్గారు! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆయన లక్ష్యం కాగా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు తన లక్ష్యాన్ని చేరుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ స్వయంకృషి, పట్టుదల, దూరదృష్టి, అన్నిటికీ మించి చాలా గుండె నిబ్బరంతో ముందుకు సాగడం వలననే నేడు ఈ స్థాయికి చేరుకున్నారని అందరికీ తెలుసు. ఆయన విజయంలో చాలామంది భాగస్వాములు ఉన్నప్పటికీ ఈ క్రెడిట్ పూర్తిగా ఆయన సొంతం అని చెప్పవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల కోసం తనకు ఇంత గుర్తింపు, ఇంతటి హోదా కల్పించిన సినిమాలను పక్కన పెట్టక తప్పడం లేదు. అందుకు అభిమానులు చాలా బాధపడుతున్నారు. కానీ తమ అభిమాన హీరోని ఉప ముఖ్యమంత్రిగా చూసుకొని సంతోషపడుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో ఇంత గుర్తింపు సంపాదించుకున్న తర్వాత సనాతన ధర్మం కోసం రాజకీయాలను పణంగా పెట్టేందుకు సిద్దపడుతుంటే ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకే సనాతన మార్గంలో ప్రయాణం ప్రారంభించారేమో? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ ఆయన సమాధానం ‘కాదు’ అయితే తన సినీ రాజకీయ పునాదులను ఆయన చేజేతులా నాశనం చేసుకొంటున్నట్లు చెప్పక తప్పదు. ఎందువల్ల అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్‌ కళ్యాణ్‌ ఆ మార్గంలో అడుగు ముందుకు వేస్తే మళ్ళీ ఎన్నటికీ వెనక్కు తిరిగి రాలేరు.

స్వర్గీయ ఎన్టీఆర్‌, యూపీ సిఎం యోగీ ఆదిత్యనాద్‌లా పవన్‌ కళ్యాణ్‌ కూడా రాజకీయ సన్యాసిగా కొనసాగాలనుకుంటే మాత్రం అసంభవమే. ఎందువల్ల అంటే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో సాధ్యం కాదు గాబట్టి. తీవ్ర రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రా ప్రజలు ఇటువంటి మార్పుని ఆమోదించబోరు గాబట్టి.

పవన్‌ కళ్యాణ్‌ ఈ రూపంలో, ఇటువంటి ఆలోచనలతో ముందుకు సాగితే అభిమానులు ఆయనని అనుసరించలేక క్రమంగా దూరం అవుతారు కూడా.

కనుక ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ తాను ఏ దిశలో ముందుకు సాగాలో స్వయంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

చివరిగా ఒక్క మాట: ఇప్పటికే సినిమాలకు దూరమయ్యి వాటి ద్వారా కలిగే గుర్తింపుని వదులుకున్నారు. ఇప్పుడు రాజకీయాల ద్వారా కలిగిన గుర్తింపుని కూడా పోగొట్టుకుంటే, పవన్‌ కళ్యాణ్‌ తన గుర్తింపుని తానే రద్దు చేసుకుంటున్నట్లు చెప్పవచ్చు. అప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఈ ప్రయాణం మొదలుపెట్టారో మళ్ళీ అక్కడికే చేరుకొంటారని చెప్పక తప్పదు. సనాతన ధర్మం కోసం పవన్‌ కళ్యాణ్‌ అందుకు సిద్దమైతే ఎవరూ కాదనలేరు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

32 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

40 minutes ago