పాపం మోత్కుపల్లి …. చూస్తామన్న వారే గానీ ఇస్తామన్న వారు లేరు

Motkupalli Narasimhuluచంద్రబాబు నాయుడుని నానా రకాలుగా దూషించి ఆ తరువాత తెలుగుదేశం నుండి బహిష్కరింపబడ్డ మోత్కుపల్లి నరసింహులు పని రెండిటికి చెడ్డ రేవడిలా ఉంది. చంద్రబాబుని దూషించి తనను కీర్తిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప్పొంగిపోయి అడిగింది లేదనకుండా ఇస్తారు అనుకుంటే అది తప్పని తేలింది.

ఆలేరు సీటు కావాలని కోరితే కుదరదు ముందు పార్టీలో చేరు తరువాత ఏదైనా నామినేటెడ్ పదవి చూస్తా అన్నారంట కేసీఆర్. మరోవైపు జగన్ ఆదేశం మేరకు విజయసాయిరెడ్డి ఆయన వద్దకు వచ్చి చెప్పినట్టు గానే ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసి చంద్రబాబుని దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తే ఎన్నికల తరువాత రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారట.

ADVERTISEMENT

అయితే ఇప్పటికే ఇటువంటి వాగ్దానాలు చేసి చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోవడంతో మోత్కుపల్లి తరువాత చూద్దాం అనే మాట ఇష్టపడటం లేదట. దీనితో భవిష్యత్తు గురించి ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. పాపం మోత్కుపల్లి …. చూస్తామన్న వారే గానీ ఇస్తామన్న వారు లేరు!

ADVERTISEMENT
Latest Stories