movie-sequels-failure-to-success

గతంలో ఏదైనా తెలుగు సినిమా నుండి దాని సీక్వెల్ విడుదలవుతుంది అంటే అది ఆ సినిమా హీరోల, దర్శకుల, నిర్మాతల పాలిట బొమ్మాలి లా బయపెట్టేది. దీనికి ఉదాహరణగా మెగా స్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS కు సీక్వెలా గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ మూవీని చూపించవచ్చు.

శంకర్ దాదా MBBS చిరు సినిమాలలో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా నిలబడితే దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ ఆయన కెరీర్ లో ఒక డిజాస్టర్ మూవీ గా మిగిలింది. ఇక అదే ఫ్యామిలి నుంచి వచ్చిన పవన్ గబ్బర్ సింగ్ కు సీక్వెల్ అంటూ వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!

ఇక ఇది కూడా అప్పటికి అదే మెగా టాగ్ తో వచ్చిన అల్లు అర్జున్, సుక్కు కాంబోలో విడుదలైన ఆర్య- 2 గురించి చెప్పుకోవాలి బ్రదర్. ఆర్య సినిమా బన్నీ ని ఇండస్ట్రీలో ఒక మెగా హీరో గా నిలబెడితే దానికి సీక్వెల్ గా వచ్చిన ఆర్య – 2 అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడి సీక్వెల్ కోరల్లో బలయ్యింది.

ఇక కిక్ సినిమా విజయం తో రవితేజకు వచ్చిన కిక్ ను దాని సీక్వెల్ కిక్ -2 సమాధి చేసేసింది. అలాగే ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిలిచిన నాగార్జున మన్మధుడు కు సీక్వెల్ గా వచ్చిన మన్మధుడు-2 మీద ఎప్పుడు లేని విధంగా నాగార్జున మీద నెగటివ్ ట్రోల్స్ చేసేలా చేసింది. ఇలాగే మరికొన్ని సీక్వెల్ సినిమాలు టాలీవుడ్ ను బొమ్మాళిలా బయపెట్టాయి. ఇక ఆ దెబ్బలతో ఈ సీక్వెల్స్ మాకొద్దు మహా ప్రభో అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ దండం పెట్టింది.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

ఇక ఈ సీక్వెల్ బొమ్మాలి పాలిట బాహుబలిగా నిలిచి ఇక ఈ ఆనవాయితీకి రోజులు చెల్లాయి అని నిరూపించింది బాహుబలి -2 . బాహుబలి ఇచ్చిన పాన్ ఇండియా విజయాన్ని పక్కన పెట్టి, సీక్వెల్ భూతం భరతం పట్టింది బాహుబలి-2 . ఇక ఆ బాహుబలి -2 ఇచ్చిన విజయంతో మొదలైన ఈ సీక్వెల్స్ పరంపర ఇప్పటికి బాక్స్ ఆఫీస్ రికార్డులను ‘రప్ప రప్ప’ కోస్తుంది.

బాహుబలి – 2 తరువాత వచ్చిన, కెజిఎఫ్ -2 , పుష్ప -2 కార్తికేయ -2 , తన మొదటి సినిమాను మించిన క్రెజ్ ను దక్కించుకుని మొదటి సినిమాకు వచ్చిన మార్కెట్ కు మించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అటు నిర్మాతలకు కాసుల పంట, ఇటు దర్శకులకు, హీరోలకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతున్నాయి. ఇప్పుడు ఇదే ఆనవాయితీని ముందుకు తీసుకు వెళ్ళడానికి మరికొన్ని సినిమాలు క్యూ లైన్ లో ఉన్నాయి.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

వాటిలో కొన్ని…దేవర-2 , సలార్ -2 , కల్కి -2 , పుష్ప -3 , కెజిఎఫ్ -3 ,కాంతారా-2, జై హనుమాన్,OG -2 ,…..ఇలా మరికొన్ని సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ మీద దండ యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో పవన్, సుజిత్ కాంబోలో రాబోతున్న OG ఇంకా మొదటి భాగాన్ని కూడా విడుదల చేయనప్పటికీ ఇప్పుడు పవన్ ఎక్కడ కనిపించిన ఆయన అభిమానుల నోటా OG నామస్మరణే వినిపిస్తుంది.




అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా నిర్మించబడుతుంది అంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో OG కూడా ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకుంది. అయితే గతంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బొమ్మాలి లా భయపెట్టిన ఈ సీక్వెల్ భూతం ఇప్పుడు కల్కి సినిమాలో బుజ్జి మాదిరి ముద్దు చేస్తుంది. బాక్స్ ఆఫీస్ మోత మోగిస్తుంది.