కేశినేని నాని: లోకేష్ ఒక ఆఫ్ట్రాల్ .!ఈయన కూడా కొడాలి బాటలోనేనా..?

Mp Kesineni Nani

వైసీపీ పార్టీకి కొత్తగా మరో నాని ని అందించింది టీడీపీ పార్టీ. నానీలు టీడీపీ పార్టీకి అచ్చురాలేదేమో అన్నట్లుగా పార్టీని వీడిన నానీలు పార్టీ అధినేతలపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా బాబు సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేదతీరడానికి జగన్ దగ్గరకు చేరారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ టీడీపీ అధినేత ఆదేశించడంతో ఏకంకా పార్టీకే దూరమయ్యారు కేశినేని నాని. ఇండిపెండెంట్ గా నిలబడి అయినా విజయవాడలో విజయం సాధిస్తా అంటూ ధీమాగా శపధాలు చేసిన కేశినేని ఇప్పుడు ఎదో ఒక పార్టీ అండ కోసం అరువులు చాచడం కాస్త విడ్డురంగానే ఉంది. ఎన్నికల సమయంలో సూర్యోదయం సమయం లో ఒక పార్టీలో ఉన్న నాయకుడు సూర్యాస్తమయానికి మరో పార్టీలోకి జంప్ అవ్వడం సర్వసాధారణం.

ADVERTISEMENT

టీడీపీ పార్టీని వదిలి వైసీపీ కండువా కప్పుకోగానే కేశినేని నానికి వైసీపీ డిఎన్ఏ వచ్చేసినట్లుంది. పార్టీ మారి పూట గడవకముందే కొడాలి నాని తరహాలో టీడీపీ పార్టీ పైన లోకేష్ పైన విరుచుకుపడ్డారు కేశినేని నాని. తాత, తండ్రి పేర్లు చెప్పుకుని రాజకీయ అడుగులు వేసిన లోకేష్ గత ఎన్నికలలో కనీసం ప్రజల మద్దతు సాధించలేకపోయారు.లోకేష్ పార్టీలో ఏ అర్హతతో యువగళం పాదయాత్ర చేసారు? ఓడిపోయిన లోకేష్ చేసే పాదయాత్రలో పాల్గొని నేను ఆయనకు జై హుజూర్ అనాలా?

అసలు పాదయాత్ర చేసేందుకు లోకేష్ కు ఎం హక్కుంది? ఆయనేమన్న తన సొంత ఆస్తులు అమ్మి రాజకీయాలు చేశారా..? నా దృష్టిలో “లోకేష్ ఆఫ్ట్రాల్” ఒక ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి మాత్రమే అంటూ కొడాలి నాని తరహాలోనే లోకేష్ పై ఘాటైన విమర్శలకు దిగారు కేశినేని నాని. అసలే దూకుడు స్వభావంతో రాజకీయాలు చేసే కేశినేని ఇప్పుడు మరింత దూకుడు పెంచే రాజకీయ పార్టీ దగ్గరకు చేరడంతో ఇక త్వరలో కేశినేని నానిని కూడా జగన్ కొడాలి నాని తరహాలో బాబు, లోకేష్ పైకి విసరబోతున్నారని ఇప్పటికే హింట్ ఇచ్చారు.

ఇక ఒక నాని విమర్శలతో రగిలి పోతున్న టీడీపీ తమ్ముళ్లు ఇప్పుడు బాబు,లోకేష్ పైకి జగన్ మరో నానిని రెడీ చేయడంతో టీడీపీ పార్టీకి ఈ నానీల గండం ఏంటిరా స్వామి అంటూ తలలు పట్టుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. రాజకీయాలలో ప్రత్యర్థి మీద విజయం సాధించాలి అంటే ప్రజలకు తాను చేసిన మంచేమిటో,చేయాలనుకుంటున్న పనులేమిటో వివరించి ప్రత్యర్థిని దెబ్బకొట్టడం సాధారణ రాజకీయంలో భాగం.

కానీ వైసీపీ లో ప్రత్యర్థిని దెబ్బకొట్టాలనుంటే ఇవేమి చెయ్యాల్సిన అవసరం ఉండదనేలా ముందుగా ప్రత్యర్థి పై మానసిక దాడి చేసి, రాజకీయాలలో సంబంధం లేని కుటుంబసభ్యులను రోడ్డు మీదకు తెచ్చి వారి పై కూడా విమర్శలు చేసి ప్రత్యర్థి పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే సరిపోతుంది అన్నట్లుగా వైసీపీ నాయకుల రాజకీయ వ్యూహాలు కనపడతాయి. మరి కేశినేని నాని కూడా ఇదే వ్యూహాన్ని ఫాలో అవుతారా లేదా అంటే…ఏమో అనే సమాధానమే కనపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories