mr-bachchan-committee-kurrollu-aay

బుల్లితెరనే వెండి తెరగా మార్చిన ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ రేపు బుల్లి తెర అభిమానులకు విందు భోజనం వడ్డించడానికి సిద్దమయ్యింది. ముందుగా హరీష్ శంకర్, రవి తేజ క్రెజీ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ రేపు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.

Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!

బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటలేకపోయి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కున్న ఈ బచ్చన్ కనీసం ఓటిటి లో అయినా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. అయితే బచ్చా బచ్చా అంటూ యు ట్యూబ్ లో దుమ్మురేపుతున్న ఈ మిస్టర్ బచ్చన్ కు ఓటిటి లో కూడా పోటీ తప్పలేదని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ అంటూ వచ్చిన రామ్, పూరి లతో పోటీ పడిన రవితేజ, హరీష్ ఇప్పుడు ఓటిటిలో ‘ఆయ్’ మూవీ తో తలపడనుంది. జూ.ఎన్టీఆర్ బంధువు నార్నె నితిన్ నటించిన ఆయ్ మంచి కామెడీ కంటెంట్ మూవీ గా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

Also Read – జగన్‌, కేసీఆర్‌… ఎప్పుడు బయటకు వస్తారో?

అయితే ఈ రెండు సినిమాల ధియేటర్ విడుదల తేదీ ఆగష్టు 15, ఓటిటి విడుదల తేదీ సెప్టెంబర్ 12 రెండు ఒకటే రోజు, ఒకటే ఓటిటి ప్లేట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో కావడం ఇక్కడ విశేషం. అయితే ఆయ్ బాక్స్ ఆఫీస్ వద్ద మిస్టర్ బచ్చన్ పైన పై చేయి సాధించిందనే చెప్పాలి. మరి ఈ ఓటిటి లో ఏ సినిమా ముందంజలో ఉంటుందో చూడాలి.




అలాగే ఈ రెండు సినిమాలకు తోడు ఈ టీవీ విన్ లో నిహారిక కొణిదెల నిర్మాత వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు మూవీ కూడా ఇదే రోజు విడుదల కానుంది. అయితే ఆగష్టు 9 న థియేటర్లలో విడుదలై ఈ మూవీ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. అయితే ఈ మూడు సినిమాల విడుదలతో సెప్టెంబర్ 12 ఓటిటి యూజర్స్ కు మంచి విందు భోజనం దొరికినట్టయింది.

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?