ఫెర్వెల్ దొరుకుతుందా..?

MS Dhoni IPL

ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది అనగానే అందరి కళ్ళు మొదట చూసేది మాజీ భారత కెప్టెన్ మరియు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని పైనే. ఐపీఎల్ లీగ్ మొదలయినప్పటి నుండే చెన్నై జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ జట్టుకు బ్రాండ్ గా నిలబడ్డాడు ధోని.

తన కెరీర్ మొదటి దశ లో, తన కెరీర్ పీక్ దశలో, నేడు తన కెరీర్ ముగింపు దశలో కూడా ధోని కు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ, 2019 లో మాహి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాక, తన ఐపీఎల్ జర్నీ అంత సజావు గా జరిగలేదనేది వాస్తవం.

ADVERTISEMENT

ఐపీఎల్ 2020 సీజన్ నుండే అదే ధోని లాస్ట్ సీజన్ అనుకుంటూ ఫాన్స్ ధోని ఎక్కడికెళ్తే అక్కడికి సైనికుల వలె వెళ్లి, తమ ఆదరణను చూపారు. ఆ సీజన్ చివరి మ్యాచ్ లో ‘డెఫినెట్లీ నాట్’ అంటూ మాహి ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు. అప్పటినుండి 5 సీజన్ల ఆటను పూర్తి చేసిన ధోని, రెండు ట్రోఫీలు కూడా అందుకున్నారు.

కానీ, 2020 నుండి చెన్నై ప్రదర్శన అనుకున్న రీతిలో లేదు. అప్పటివరకు జరిగిన ప్రతి ప్లే-ఆప్స్ కు అర్హత సాధించిన చెన్నై, 2020 ఐపీల్ లో మొట్టమొదటి సారి ప్లే-ఆప్స్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. అయితే, దీనికి అపోజిట్ గా 2021 ట్రోఫీ గెలుచుకుని కం-బ్యాక్ ఇచ్చినట్టే కనపడ్డారు చెన్నై జట్టు.

అయితే, మరలా 2022 ఐపీఎల్ లో ఘోర ఓటములతో మరోసారి ప్లే-ఆప్స్ కు అర్హత సాధించకుండానే ఇంటి దారి పట్టింది చెన్నై జట్టు. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్లకు కెప్టెన్ గా జడ్డు వ్యవహరించటం గమనార్హం. మరోసారి, దీనికి అపోజిట్ గా 2023 లో ఉత్కంఠ భరిత ఫైనల్ లో చెన్నై జట్టు ఛాంపియన్స్ గా నిలిచారు.

కానీ, అసలు సమస్య మొదలయింది ఇక్కడి నుండే. ట్రోఫీ అందుకున్నాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనుకున్న అభిమానులకు షాక్ ఇవ్వకుండా, మరోసారి ఆడటానికి వచ్చిన ధోని కు ఆ సీజన్ అంత గుర్తుండే రకంగా ఏమి జరగలేదు. చెన్నై నిలకడ లేమి కు ప్రతీకగా మరోసారి లీగ్ స్టేజ్ లో నే ఇంటి దారి పట్టింది చెన్నై.

మరి 2025 లో కం-బ్యాక్ ఇచ్చి స్ట్రీక్ కొనసాగిస్తారనుకున్న అభిమానులకు లీగ్ ముగిసే సమయానికి అసంతృప్తి ఒకటే తోడుంది. అత్యంత ఘోరమైన విధంగా విఫలమవుతూ పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పరిమితయమయింది చెన్నై జట్టు. ఆడిన 14 మ్యాచ్లలో కేవలం 4 మ్యాచ్లు నెగ్గి మునుపెన్నడూ లేని చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

తన కెరీర్ లో నే అత్యంత ఘోరమైన ఐపీఎల్ సీజన్ తరువాత ధోని మరోసారి ఆడటానికి వస్తుండటంతో ధోని నుండి అభిమానులు భారీ గా నే ఆశిస్తారు. ఇదే ధోని చివరి సీజన్ కానుంది అనే రిపోర్ట్స్ రావటం తో, గత 2 ఏళ్లగా ఫాన్స్ అంటున్న ఆ ఫెర్వెల్ ఈసారి ట్రోఫీ తో కలిసి వస్తుందేమో చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories