‘కాపు’ జాతి నా ‘మాట’ జవదాటదు!

mudragada padmanabham over confidence on kapu communityకాపు కులం మొత్తానికి సంబంధించిన ఇంతటి బరువైన మాటలను చెప్పింది ఎవరనుకుంటున్నారా..? ఏ రేంజ్ లో ప్రజాభిమానం ఉంటేనో గానీ చెప్పడానికి ఆస్కారం లేని ఈ ప్రకటనలను చేసింది ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గానీ లేక మెగాస్టార్ చిరంజీవి గానీ అనుకున్నారో పొరపాటే అవుతుంది. ‘కులం’ పేరుతో పెట్టుకున్న ఒక సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి, బహుశా తానూ ప్రజల్లో ఒక హీరో అనుకున్నారో ఏమో గానీ.., రాజకీయ నిలకడ, మాట నిలకడ లేని ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలివి.

“కాపు జాతి నా మాట జవదాటదు, సభలోకి ఆగంతుకులను పంపించి టిడిపినే అలజడి సృష్టించింది, కాపులను దెబ్బకొట్టేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది, చట్టబద్ధతతో రిజర్వేషన్లు రావాలంటే కాపులు మరో జన్మ ఎత్తాల్సిందే” అంటూ అధికార పార్టీపై ముద్రగడ పద్మనాభం మండిపడిన తీరుతో, ఈయన వెనుక ఎవరున్నారో పరోక్షంగా చెప్పకనే చెప్పారని పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తానూ ఏ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్తున్న ముద్రగడ, మరి ఒక పార్టీకి అనుకూలంగా మారి మరో పార్టీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా ముద్రగడ తన స్థాయికి మించి ఎక్కువగా ఊహించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories