మణి శర్మ బ్యాక్ ఇన్ డిమాండ్… మరో స్టార్ సినిమా

Manisharma music for Chiranjeevi - Koratala siva movieరామ్, పూరి జగన్నాధ్ ల ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ మళ్ళీ బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కు మ్యూజిక్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి మణి శర్మ ఎన్నో బ్లాక్ బస్టర్ ఆడియోలు ఇచ్చారు. తాజాగా ఆయన మరో స్టార్ సినిమా సైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

ADVERTISEMENT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల శివ చెయ్యబోయే తదుపరి చిత్రానికి ఆయన మ్యూజిక్ చేస్తారట. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గతంలో అల్లు అర్జున్ నటించిన వరుడు, పరుగు సినిమాలకు మణి శర్మ మ్యూజిక్ చేశారు. దాదాపుగా పుష్కరం తరువాత వారిద్దరూ మళ్ళీ కలిసి పని చెయ్యబోతున్నారు.

ఇది ఇలా ఉండగా… అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పుష్ప ప్రారంభానికి ఎదురుచూస్తున్నాడు. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శేషచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చెప్పే ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ లారీ డ్రైవర్, పుష్పరాజ్ గా కనిపిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కావొచ్చు.

ఆ తరువాత కొరటాల సినిమా పట్టాలెక్కుతోంది. టాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువ. కొరటాల తన కెరీర్‌లో ఇప్పటివరకు ఫ్లాప్ అనేది చవి చూడలేదు. ఇప్పటివరకు అతని అన్ని చిత్రాలు విడుదలైనప్పుడు సంబంధిత హీరోల యొక్క అతిపెద్ద హిట్సగా నిలిచాయి. దీనితో రాజమౌళి తరువాత కొరటాలకు టాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువ.

ADVERTISEMENT
Latest Stories