అన్నం పెట్టే సినిమాని సచ్చిన పాము అనడం ఎంటి తమన్?

Music Director Thaman

టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్… ఫుల్ గా సినిమాలతో ఏడాది అంతా బిజీ. స్టార్స్ కి కూడా తమనే కావాలి. ఎన్నో హిట్ ఆల్బమ్స్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

అయితే ఇటీవలే తమన్ చుట్టూ ఎన్నో వివాదాలు. పాటల్లో విషయం తగ్గింది… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పస లేకుండా పోయింది. ఆ మధ్య సర్కారు వారి పాట… నిన్న వచ్చిన స్కంద విషయంలో చాలా విమర్శలు. అలాగే సూట్ రూమ్లు, తడిచి మోపెడు అయ్యే బిల్లుల తో నిర్మాతలకు కూడా ఇబ్బందే తమన్ తో.

ADVERTISEMENT

అయితే హవా నదిచినంత కాలం ఇబ్బంది రాలేదు. సోషల్ మీడియా లో తమన్ కాపీ కొడతారని ముందు నుండి ట్రాలింగే. ఇప్పుడు నాసిరకం మ్యూజిక్ కారణంగా ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.

మొన్న భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో సోషల్ మీడియా లో ‘నా కొడుకులు‘ అంటూ తమన్ నోరు పారేసుకున్నాడు. తాజాగా సోషల్ మీడియా ట్రాలింగ్ మీద మరోసారి తమన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

“మంచి సీన్ ని మ్యూజిక్ ఎలివట్ చేస్తుంది. విషయం లేకపోతే నేనేం చెయ్యను? మీరు సచ్చిన శవాన్ని తెచ్చి బ్రతికించమంటే ఎలా? అక్కడ మేటర్ లేకపోతే నేనేం చెయ్యను?,” అన్నాడు తమన్.

అయితే ఈ వ్యాఖ్యల మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో అందరికీ తమన్ తో సహా అన్నం పెట్టే సినిమా నీ సచ్ఛిన శవం అంటూ పోల్చడం దారుణం అని పలువురు అంటున్నారు. సినిమా ను, అవకాశం ఇచ్చిన హీరోలను, డైరెక్టర్ల ను అవమానించడమే కదా.

ఒక సినిమా మీద చూసే వాళ్లకు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. తీసిన వాళ్లకు, పనిచేసిన వాళ్లకు కూడా మర్యాద లేకపోతే ఎలా?

ఇక అసలు విషయానికి వస్తె… సినిమాలో మేటర్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఏమి చెయ్యలేడా? కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు తమ మ్యూజిక్ తో జీవం లేని సీన్ కు ప్రాణం పోసిన సందర్భాలు ఎన్నో… కొన్ని సినిమాల్లో సీన్ లో విషయం లేకపోయినా తమ మ్యూజిక్ కి సభాష్ అనిపించుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు.

మరి తమన్ చెబుతున్న ఈ కారణాలు, శవం లాజిక్లు వంకలే కదా? అలాగే మంచి సీన్లు కూడా తమన్ మ్యూజిక్ బాగోక పోవడం వల్ల ఎలివెట్ అవ్వలేదు అని కొన్ని కంప్లయింట్లు ఉన్నాయి. మరి దానికి తమన్ ఏమంటారు?

తన సంగీత సరస్వతి ని ఎవరైనా రేపు నేను మంచి సీన్ తీశాను కానీ సచ్చిన పాము లాంటి మ్యూజిక్ ఇస్తే నేను ఏమి చెయ్యను అంటే తమన్ రియాక్షన్ ఎలా ఉంటుంది?

ADVERTISEMENT
Latest Stories