అల వైకుంఠపురములో నిర్మాతలకు షాక్ ఇచ్చిన థమన్

music director Thaman special demand to Ala Vaikunthapurramloo producersస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా జనవరి 12, 2020న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఆ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఇప్పటివరకూ విడుదలైన మూడు పాటలలో రెండు సూపర్ అనిపించుకోవడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మొదటిపాట ‘సామజవరగమన’ ఇప్పటివరకు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. ఈ పాటలకు వస్తున్న ఆదరణకు తను కూడా ప్రమోట్ అవ్వాలి అనుకున్నాడేమో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నిర్మాతల ముందు ఒక కొత్త డిమాండ్ పెట్టాడట.

ADVERTISEMENT

తనపై ఒక స్పెషల్ సాంగ్ వీడియో చెయ్యాలని, అందుకోసం ఒక స్పెషల్ సెట్ వెయ్యాలని అడిగాడట. ఇప్పటికే సినిమా బడ్జెట్ తడిచి మోపెడు కావడంతో నిర్మాతలకు నూటరెండు వచ్చిందట. దీనిపై వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి భారీ హిట్లు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి.

హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. చిత్రంలో ఒక కీలక పాత్రలో ఆమె చెయ్యబోతుందని సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ గత సినిమా నా పేరు సూర్య ప్లాప్ కావడంతో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories