కేంద్రంలో పెద్దలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు: జనసేన

Nadendla Manohar YS Jagan Government Funds Diversionజనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ జగన్ ప్రభుత్వం మీద ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తాజా వీడియో సందేశంలో “రాష్ట్రంలో పేదలకు టిడ్కో ఇళ్ళు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలలో అక్షరాల రూ. 22,737 కోట్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం దానిలో కేవలం రూ.4,915 మాత్రమే ఉపయోగించుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం వాటాను జోడించలేని దుస్థితిలో ఉంది కనుకనే కేంద్రం ఇస్తున్న ఈ నిధులను పూర్తిగా వినియోగించుకోలేకపోయింది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితులు నెలకొనడంతో వివిద పధకాలకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్ళించి వాడేసుకొంటోంది. మరి కేంద్రంలో మంత్రులు, పెద్దలు ఏం చేస్తున్నారో అర్దం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వలన రాష్ట్రంలో 1.19 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తికాలేదు. వాటి కోసం లబ్దిదారులను ఎంపికచేసి బ్యాంకులు రూ. 4,107 కోట్ల రుణాలు ఇవ్వడానికి ముందుకువచ్చాయి. కానీ దానిలో రూ.1,602 కోట్లు మాత్రమే మంజూరుకాగా చివరికి కేవలం రూ.1,372 కోట్లు మాత్రమే లబ్దిదారుల చేతికి అందాయి.

ADVERTISEMENT

గత సంవత్సరం జూన్ 21కల్లా ఇళ్ళ నిర్మాణాలు పూర్తిచేసి 18,063 మంది లబ్దిదారులకు అందజేస్తామని జగన్ ప్రభుత్వం చెప్పింది. కానీ నేటికీ వాటిని పూర్తి చేయలేకపోయింది. లబ్దిదారులు బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ప్రభుత్వానికి చెల్లించిన ఆ సొమ్ముకు వడ్డీలు కట్టుకొంటూ నానా అవస్థలు పడుతున్నారు. మూడున్నరేళ్ళు గడిచిపోయినా జగన్ ప్రభుత్వం ఇంతవరకు ఆ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయలేకపోతోంది.

మా పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో ఎక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుంచి ఎక్కువగా టిడ్కో గృహాలకు సంబందించిన వినతి పత్రాలే వస్తున్నాయంటే పేద ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్దం చేసుకోవచ్చు. ఇటువంటి సంక్షేమ పధకాలకు కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల వినియోగించుకోలేకపోతుండటంతో మద్యలో పేదలు నష్టపోతున్నారు. జగన్ పరిపాలన ఈవిదంగా సాగుతుంటే రాష్ట్రాన్ని ఏవిదంగా ముందుకుతీసుకు వెళ్ళగలదు? అని ప్రతీ ఒక్క పౌరులు ఆలోచించవలసి ఉంది,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories