జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించిన మెగా బ్రదర్

Naga Babu praises Jr NTRనా ఛానల్ నా ఇష్టం పేరుతో ఒక ఏడాది కాలం నుండీ మెగా బ్రదర్ నాగబాబు సమకాలీన విషయాల పై తన అభిప్రాయాలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు. తాజాగా ఆయన సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానంతరం సినీ వారసుల మీద జరుగుతున్న దాడిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ADVERTISEMENT

పెద్ద స్టార్ల వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరించాలని లేదని… వారసులకు అవకాశాలు వస్తాయేమో గానీ వారు కూడా అందరి మాదిరిగానే కష్టపడి ప్రేక్షకులను ఇంప్రెస్ చెయ్యాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఉదాహరించడం విశేషం..

“జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి మనవడు అని చూస్తున్నారా? ఆ అబ్బాయిలో యాక్టింగ్ గానీ టాలెంట్ గానీ డ్యాంసింగ్ గానీ చూసి చూస్తున్నారు ఆయన సినిమాలు… హి ఐస్ ఏ క్లాసిక్ డ్యాన్సర్. అతను యాక్టింగ్ చెయ్యడానికి ఎంత తపన పడతాడో తెలిస్తే ఆశ్చర్య పడతారు. అఫ్ ది రికార్డులో చాలా మందికి తెలుసు అలాగే నాకు తెలుసు,” అని చెప్పుకొచ్చారు.

“అరవింద సమేతలో నేను చేసినప్పుడు 43, 44 డిగ్రీల ఎండలో షర్ట్ తీసి నాకే అయ్యో పాపం అనిపించింది. మాకు లోపల కూర్చుంటేనే స్కిన్ మాడిపోతుంటే అతను ఎండలో చేశాడు. అందుకు చూస్తారు అతని సినిమాలు,” అన్నారు ఆయన. వారసుల విషయం వచ్చే సరికి మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మంది ఇండియన్ సినిమాలోనే ఎవరూ ఉండి ఉండరు.

ADVERTISEMENT
Latest Stories