షూటింగ్ కు సిద్ధం అని ప్రకటించిన మరో స్టార్ సినిమా

Naga Chaitanya Akkineni Hero on a Roll with Impressive Classy Lineupసెప్టెంబర్ రెండో వారం నుండి తమ షూటింగ్ మొదలు పెడతామని ప్రభాస్ రాధే శ్యామ్ టీం ఇప్పటికే ప్రకటించగా.. మరో స్టార్ సినిమా కూడా తమ షూట్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి తమ చిత్రం చివరి షెడ్యూల్ మొదలుకాబోతుందని నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా బృందం ప్రకటించింది.

ADVERTISEMENT

షెడ్యూల్ కు ముందే టీం అందరికీ కరోనా టెస్టులు చేస్తారు. పదిహేను రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఎవరినీ షూటింగ్ లొకేషన్ వదిలి బయటకు వెళ్లనివ్వరు. షూటింగ్ లొకేషన్ లో అన్ని సేఫ్టీ నిబంధనలు పాటిస్తారు. థియేటర్లు తెరవగానే జనవరి నెలలో ఈ సినిమాను విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు.

కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టి, హీరో సరిగా లేడు అనే కారణంగా ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు అదే స్క్రిప్టును యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిలతో ఈ సినిమాగా తీస్తున్నారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు.

ADVERTISEMENT
Latest Stories