నాగచైతన్య మంచి నిర్ణయమే తీసుకున్నాడు

naga chaitanya akkineni took wise decisionయుద్ధం శరణం, సవ్యసాచి వంటి మాస్ సినిమాలలో నటించి చేతులు కాల్చుకున్నాడు నాగచైతన్య. అయితే ఇప్పుడు అతనికి తత్వం బోధపడినట్టు ఉంది మజిలీ నుండి ట్రాక్ మార్చాడు. లాభాల శాతం పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది వేసవిలో వచ్చిన అతిపెద్ద హిట్ మజిలీ. దీనితో తనకు క్లాస్ సినిమాలతోనే భవిష్యత్తు అని నాగచైతన్యకు అర్ధం అయినట్టు ఉంది. దీనితో ఆయన పంథా మార్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. నాగచైతన్య, వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ షూటింగ్ జరుగుతుంది.

ADVERTISEMENT

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. వెంకీ మామ విడుదల ప్లాన్ ను నిర్మాతలు వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రం తరువాత శేఖర్ కమ్ములతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు చైతన్య. సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఈ చిత్రం లవ్ స్టోరీ. నిన్న అధికారకంగా ప్రకటించారు. ఆగష్టు మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మధ్యలో నాగచైతన్య రెండు మూడు మాస్ కథలు చెయ్యాల్సి ఉన్నా వాటికి పక్కన పెట్టేశాడు. దీనితో నాగచైతన్య మంచి నిర్ణయమే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది.

తనకు సూట్ అయ్యే ఇటువంటి సినిమాలు మంచి కథలను ఎంచుకుని చేస్తే ఖచ్చితంగా ఆ సెగ్మెంట్ లో ట్రేడ్ కు నమ్మకమైన హీరోగా సెటిల్ అవుతాడు. కేరీర్ ఆరంభం నుండి ఒడిదుడుకులుగానే ఉన్న ఆయన మొత్తానికి సెట్ అయ్యే అవకాశం ఉంది. రానున్న ఒక ఏడాది చైతన్య కేరీర్ లో కీలకం కాబోతుంది. మరోవైపు నాగచైతన్య సతీమణి సమంత కూడా పెళ్లి తరువాత విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ మంచి హిట్లు సాధిస్తుంది. దీనితో వారిది హ్యాపీ ఫ్యామిలీ అనవచ్చు.

ADVERTISEMENT
Latest Stories