థాంక్ యూ చెబుతున్న నాగచైతన్య

Naga Chaitanya - director Vikram Kumar Movie Title Thank youఅక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కముల సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ వేసవికి విడుదల కాబోతుంది. ఆ తరువాత ఇటీవలే ఓ బేబీ వంటి పెద్ద హిట్ ఇచ్చిన నందినీ రెడ్డితో, అలాగే గతంలో తనకు మనం వంటి అద్భుతమైన సినిమా ఇచ్చిన విక్రమ్ కె కుమార్ తో రెండు సినిమాలు ఒకే చేశాడట.

ADVERTISEMENT

విక్రమ్ కె కుమార్ తో చేసిన సినిమాకు థాంక్ యూ అనే పేరు అనుకుంటున్నట్టు సమాచారం. విక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట. ఈ సంవత్సరం రెండో భాగంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా మీద అక్కినేని అభిమానులలో అంచనాలు భారీగా ఉండబోతున్నాయి.

మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు మరి విక్రమ్. అయితే మనం తరువాత విక్రమ్ కు ఆ స్థాయి సినిమా రాలేదు. అసలైతే అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది. దీనితో కసిగా పని చేస్తున్నట్టు సమాచారం.

గతంలో జోష్ అనే సినిమాతో నాగచైతన్యను పరిచయం చేసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక నందిని రెడ్డి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా చూడాలి. ఈ రెండు సినిమాలకు ఒకే సారి షూటింగ్ చేస్తాడేమో చూడాలి. ఈ రెండు సినిమాల అధికారిక ప్రకటన తరువాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories