నాగచైతన్య ప్లానింగ్ అదిరిపోయింది

Naga Chaitanya next with mohana krishna indraganti- (2)నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా తరువాత నాగచైతన్య బంగార్రాజు సినిమా షూటింగ్ మొదలుపెడతాడు. ఆ సినిమాలో చైతన్య ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు.

మొన్న ఆ మధ్య నాగచైతన్య గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తో ఒక చిత్రం ప్రకటించాడు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాలతో ఈ సినిమా అటకెక్కింది. పరశురాం ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. దీనితో ఇప్పుడు నాగచైతన్య ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఒక సినిమా కు పచ్చ జండా ఊపనున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ఇంద్రగంటి ప్రస్తుతం నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 25న ఉగాది సందర్భంగా విడుదల అవుతుంది. ఈ చిత్రం ప్రచారచిత్రాలు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీనితో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. దీనితో నాగచైతన్యతో ఇంద్రగంటి సినిమా అంటే మంచి పరిణామమే.

నాగచైతన్య కెరీర్ కూడా ఇప్పుడే గాడిలో పడింది. మజిలీ పెద్ద హిట్ అయ్యాకా వెంకీ మామ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద బాగానే ఆడింది. ఇప్పుడు లవ్ స్టొరీ, బంగార్రాజు, ఇంద్రగంటి సినిమాలు కూడా మంచి లైన్ అప్పే. ఈ మూడు సినిమాలు గనుక హిట్ అయితే ఇక నాగచైతన్య వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories