అక్కి నేని నాగ చైతన్య…ఎక్కడా తగ్గడం లేదు..2009 లో జోష్ తో తన కెరీర్ ను మొదలు పెట్టిన చైతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు…హిట్స్ పరంగా పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి చైతూ చేతుల్లో లేనప్పటికీ సినిమాల విషయంలో మాత్రం చైతూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఉంటున్నాడు.
[m9ad]
తాజగా సవ్యసాచి సినిమా పాత్ర పరంగా చైతూకి మంచి పాత్రే పడినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా సినిమా ఢమాల్ అంది…ఇక చైతూ తన నెక్స్ట్ సినిమా విషయమే తీసుకుంటే బాలీవుడ్ లో “బరెయిలీ కి బర్ఫీ” సినిమా రీమేక్ లో నటించనున్నట్లు ఇప్పటికీ వార్తలు వచ్చాయి..అయితే ఈ సినిమా రైట్స్ ని కోనా అండ్ టీమ్ కొన్నట్లు… ఈ సినిమాని వాళ్ళ నిర్మాణంలో నిర్మించనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాని చైతూ ఒప్పుకున్నాడా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు..ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంపై చైతూ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని…చైతూ ఒప్పుకోగానే సినిమా నిర్మాణం మొదలుకానుంది అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్తా..
మరి చైతూ ఎప్పుడు ఒకే అంటాడో…ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో చూద్దాం.



