యువహీరో కు ఏఎన్నార్ క్లాసిక్ చిత్రం టైటిల్

Naga Shaurya announces his next movieప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తమ 8 వ చిత్రాన్ని నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించింది. యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ‘మే’ నెలలో విడుదల అవుతుందని వారు ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT

ఈ సినిమాకు ఏఎన్నార్ – సావిత్రి నటించిన క్లాసిక్ చిత్రం ‘మూగ మనసులు’ పేరు అనుకుంటున్నారు. చిత్రానికి ‘మూగ మనసులు 2020’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మంచి ఎమోషనల్ కంటెంట్ కలిగిన లవ్ స్టోరీ అని వార్తలు వస్తున్నాయి.

నాగసౌర్య ప్రస్తుతం రమణ తేజ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. బీచ్ రోడ్ లో చిత్రానికి సంబంధించిన ఒక పాట చిత్రీకరిస్తున్నారు. మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నాగసౌర్య హోమ్ ప్రొడక్షన్ లో ఈ చిత్రం నిమిస్తున్నారు. అశ్వద్దామా అనే టైటిల్ అనుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories