నాగబాబు పవన్ కళ్యాణ్ తో టచ్ లో లేరా?

Nagababu-Pawan-Kalyan-Latest-Political-Jana-Sena-Interviewsగత కొంత రోజులుగా పవన్ కళ్యాణ్ ఒక న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్ పెట్టనున్నారని వార్తలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు బలమైన మీడియా హౌసులు సపోర్టు ఉండడంతో తమకు మీడియా సపోర్ట్ ఉండాలని పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుకుంటున్నారట. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

“ఇప్పుడు ఉన్న ఛానల్స్ అన్నీ అటో ఇటో ఉన్నాయి. జనసేనకు మీడియా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు అయితే అటువంటి అవకాశం లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఏదో మీడియా స్థాపించే పనిలో ఉన్నారని ఈ మధ్య ఎక్కడో విన్నా.. నాకు కూడా సరిగా తెలీదు ఆ విషయం గురించి,” అని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

నాగబాబు, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు. నాగబాబు గత ఎన్నికలలో నరసాపురం ఎంపీగా పోటీ చేసి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. కొన్ని వివాదాలు తెచ్చిపెట్టినా, నాగబాబు జనసేనకు గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. అయితే కీలకమైన విషయంలో కూడా నాకు తెలీదు అనడం ఆశ్చర్యం కలిగించింది.

నాగబాబు పవన్ కళ్యాణ్ తో టచ్ లో లేరా? ఇంత కీలక విషయం గురించి కూడా వారి మీద చర్చ లేదా? ఇది ఇలా ఉండగా… ఇక ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదని నాగబాబు అంటున్నారు. అయితే పార్టీ కోసం తాను చెయ్యాల్సింది అంతా చేస్తా అని ఆయన చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories