నాగ్ అండతో ‘బిగ్ బాస్ 2’లో నేడు సంచలనం?

Nagarajuna promoting devadas in bigg boss 2  teluguనాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తోన్న “బిగ్ బాస్ 2” షోలో నేడు ‘కింగ్’ నాగార్జున ప్రత్యక్షం కాబోతున్నారు. వచ్చేవారం నాగ్ – నానిలు కలిసి ‘దేవదాస్’ రూపంలో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుండగా, అంతకు కొద్ది రోజుల ముందే స్మాల్ స్క్రీన్ పై వీరిద్దరూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా సదరు మీడియా ఛానల్ రిలీజ్ చేసింది.

[m9ad]

ADVERTISEMENT

ఇదిలా ఉంటే నేడు ‘బిగ్ బాస్ 2’ హౌస్ లో ఒక సంచలన నిర్ణయం వెలువడబోతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ప్రతి వారం జరుగుతున్న ఎలిమినేషన్స్ పేరును ఒక రోజు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ కావడం, అది నిజం కావడం మొదటి వారం నుండి జరుగుతున్నదే. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి మరెవరో కాదు, కౌశల్ అన్న పేరు బలంగా వినపడుతోంది.

‘కౌశల్ ఆర్మీ’ పేరుతో సోషల్ మీడియాలో కౌశల్ కు లభించిన మద్దతు తెలియనిది కాదు. అయితే ఇందులో ఫేక్ కూడా ఉందన్న సమాచారం ఉన్నప్పటికీ, ఈ ‘కౌశల్ ఆర్మీ’ వలనే ఇన్నాళ్ళు హౌస్ లో విజయవంతంగా కౌశల్ కొనసాగాడన్నది వాస్తవం. కానీ నేడు ‘బిగ్ బాస్’ కౌశల్ ను ఎలిమినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, అదే జరగబోతుందన్న ప్రచారంలో వాస్తవం తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories