అభిమానులకు నాగార్జున వినూతనమైన గిఫ్ట్

Nagarjuna -akkineni next with Director kalyan krishnaవరుస పరాజయాలతో సతమతం అవుతున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తన తరువాతి సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ గా రూపొందనున్న బంగార్రాజు సినిమా మొదలు పెట్టబోతున్నారని సమాచారం.

ఈ నెలాఖరున ఈ సినిమా అధికారిక ప్రకటన ఉండొచ్చంట. మాములుగా కాకుండా ఒక చిన్న వీడియోతో బంగార్రాజు ఐస్ బ్యాక్ అంటూ ఈ ప్రాజెక్టును ప్రకటించబోతున్నారని సమాచారం. కళ్యాణ్ కృష్ణ నాగార్జునకు, నాగచైతన్యకు పెద్ద హిట్లు ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయన విడుదలైన నాటి నుండీ ఈ ప్రాజెక్టు గురించి వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే అనేక కారణాలతో అది వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో కళ్యాణ్ కృష్ణ సోదరుడి మరణంతో సినిమా మరింత వెనక్కి వెళ్లింది. మొత్తానికి ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. కథా కథనాలు సిద్ధం కావటంతో మార్చిలో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అప్పట్లో సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతికి విడుదల చేశారు… ఇప్పుడు బంగార్రాజు కూడా అదే విధంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరో తెలియాల్సి ఉంది

ADVERTISEMENT
Latest Stories