అయినా నాగార్జున మారలేదు

Nagarjuna Akkineni next with Maharshi writer Ahishor Solomon
మనం సినిమా తరువాత నేను పూర్తిగా మారిపోయానని, ఇక నుండి ఫ్యాన్స్ గర్వపడే సినిమాలు మాత్రమే చేస్తా అని నాగార్జున ప్రకటించారు. ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి వంటి మంచి సినిమాలు తీశారు ఆయన. దీనితో అక్కినేని అభిమానులు ఉబ్బితబ్బిబైపోయారు. అయితే ఆ తరువాత సీన్ మారిపోయింది. 2016 తరువాత హిట్టయిన ఊపిరి తరువాత ఆయన వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు. ప్లాపులు రావడం ఒక హీరోకు సహజమే కాకపోతే ఆ ఆరులోని ఆఫీసర్, మన్మథుడు 2 వంటి ఘోరమైన ప్లాపులు వచ్చాయి.

ఆ రెండు సినిమాలు ప్లాపులే కాకుండా అవమానకరంగా కూడా ఉన్నాయి. మన్మథుడు 2 డైరెక్టర్ ఛాయస్ తప్పని అభిమానుల అభిప్రాయం అయినా నాగార్జున మారలేదట. ఇంకా ఎక్సపెరిమెంట్లు చెయ్యడం మాననని అంటున్నారు నాగార్జున. మహర్షికి రైటర్ గా పని చేసిన సోలోమన్ వినిపించిన ఒక కథ నాగార్జున కు బాగా నచ్చిందట. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించే అవకాశం వుంది. తొందరలో అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందట.

ADVERTISEMENT

అయితే నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం అక్కినేని అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు. ఇదిలావుంటే నాగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమా చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ కృష్ణ నాగార్జునకు, నాగచైతన్యకు పెద్ద హిట్లు ఇచ్చాడు. ఆ ప్రాజెక్టును మాత్రం నాగార్జున ఏదో ఒక కారణంగా లేటు చేస్తున్నాడు. ఈ లోగా ఇలాంటి సినిమాలు తీసి ప్లాపులు మూటగట్టుకుంటున్నాడని అభిమానుల ఆగ్రహం.

ADVERTISEMENT
Latest Stories