నాగార్జున బర్త్ డే… హడావిడంతా నాగచైతన్యదే

Nagarjuna-Wants-Director-to-Recreate-Magic-If-Not-Betterకింగ్ నాగార్జున బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నాగార్జున సందడి నెలకొంది. ఫ్యాన్స్ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్రెండ్ చేస్తుండగా… అక్కినేని హీరోల తరువాతి చిత్రాల టీమ్స్ ఆయనకు స్పెషల్ విషెస్ చెప్పాయి. నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా బృందం వారి చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదల చేశారు.

ADVERTISEMENT

పొదల చాటు నుండి గన్ గురిపెడుతున్న నాగార్జున పోస్టర్ లో కనిపిస్తారు. ఇక ఈరోజు హడావిడంతా నాగచైతన్యదే అని చెప్పుకోవాలి. ఆయన తన తదుపరి చిత్రం థాంక్ యూ ని అధికారికంగా తన తండ్రికి థాంక్ యూ చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అలాగే తన మరో సినిమా… లవ్ స్టోరీ కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.

అదే సమయంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుండి తమ చిత్రం చివరి షెడ్యూల్ మొదలుకాబోతుందని ఆ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉండగా.. అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ టీం ఎటువంటి పోస్టర్ విడుదల చెయ్యకపోవడం అభిమానులను నిరాశపరచింది. అలాగే కోడలు సమంత నటించబోతున్న సినిమాల హడావిడి కూడా మిస్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా… నాగార్జున వచ్చే సోమవారం నుండి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టి… మొత్తం షూట్ పూర్తి చేసే అవకాశం ఉంది. డైరెక్టుగా ఆన్ లైన్ విడుదల చెయ్యాలని మొదట్లో ఆలోచన చేసినా వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నం విమరించుకుని, థియేటర్లు ఓపెన్ అయ్యాకే సినిమాను విడుదల చెయ్యాలని వారు నిర్ణయించుకున్నారట.

ADVERTISEMENT
Latest Stories