“మనం, సోగ్గాడే చిన్నినాయనా” సినిమాల ఘనవిజయాలతో యూత్ లో ‘కింగ్’ నాగార్జున క్రేజ్ భారీగా పెరిగింది. ఇందుకు నిదర్శనమే ‘మనం’ 40 కోట్ల క్లబ్, ‘సోగ్గాడే చిన్నినాయనా’ 50 కోట్ల క్లబ్. ఈ మొత్తంలో ఓవర్సీస్ ప్రేక్షకుల పాత్ర కూడా చాలా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి క్రేజీ స్టార్ హీరోలకు మొన్నమొన్నటి వరకు సాధ్యం కాని రికార్డులను 50 ఏళ్ళ వయసులో ‘కింగ్’ వశం చేసుకున్నాడు.
ఈ నేపధ్యంలో నాగ్ నటించిన తాజా చిత్రం “ఊపిరి” సినిమాకు కూడా ఓవర్సీస్ లో భారీ బిజినెస్ జరుగుతోందని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు 3 కోట్లకు ఆఫర్ రాగా, ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తర్వాత ఈ సినిమాపై మరింతగా నమ్మకం పెరిగిందని, ముఖ్యంగా నాగార్జున ఎంపిక చేసుకుంటున్న పాత్రల పట్ల ప్రేక్షకుల్లో నమ్మకం పెరిగిందని, ఇదే క్రేజ్ గా పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక, టీజర్ విడుదల తర్వాతే పరిస్థితి ఇలా ఉంటే, మార్చి 1వ తేదీన హైదరాబాద్ లోని, నోవాటెల్ హోటల్ విడుదల కానున్న “ఊపిరి” ఆడియో మరియు ధియేటిరికల్ ట్రైలర్ తర్వాత స్పందన మరింతగా పెరిగే ఆస్కారం ఉందని, ఇది కూడా సక్సెస్ సాధించగలిగితే, నాగార్జున ‘హ్యాట్రిక్’ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఘనత దక్కుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.



