బజ్జీలకు పనికి వస్తున్న న్యూస్ పేపర్!

namasthe-telangana-news-paper-useful-for-bhajjisరోజూ వారీ సమాచారాన్ని తెలుసుకోవడానికి సాధారణంగా దినపత్రికలు వినియోగిస్తుంటారు. అయితే తెలంగాణా గడ్డ మీదున్న ‘నమస్తే తెలంగాణా’ న్యూస్ పేపర్ ను మాత్రం ‘బజ్జీల’ బండికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఛలోక్తులు విసిరారు. రూపాయి పెట్టి కొనుక్కుంటే బజ్జీల బండి వారికి అయిదు రూపాయలు లాభం అవుతుంది… అందుకే ‘నమస్తే తెలంగాణా’ పత్రిక చదవడానికి కాదు, బజ్జీల పొట్లాలు కట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాది.

అలాంటి పేపర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 80 స్థానాలు వస్తాయని చెప్తోంది. ఇది ‘నమస్తే తెలంగాణా’ కాదు, ‘గుమస్తా తెలంగాణా’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలెత్తారు. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఆ పార్టీకే తెలియదని, 100 సీట్లు వస్తాయని సవాల్ విసిరిన కేటీఆర్ చివరకు తోక ముడిచారని, ఇటీవల కేసీఆర్ చెప్తూ తమకు 60 సీట్లు వస్తాయని, ఎంఐఎం పార్టీతో కలిపి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్తున్నారని, అసలు టీఆర్ఎస్ కు వచ్చేది కేవలం 30 సీట్లు మాత్రమే వస్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్లుగా తనదైన రీతిలో వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories