రైతుల మధ్య సిఎం చంద్రబాబు.. జగన్‌ ఎక్కడ?

Chandrababu Naidu meets cyclone-affected farmers

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కనుక ఆ మూడు పార్టీల నేతలు ఆ లెక్కలు కట్టుకుంటూ, విజయోత్సవాలతో బిజీగా ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు కాదు.

నిన్న పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వేకు వెళ్ళి తుఫాను ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

ADVERTISEMENT

మళ్ళీ నేడు మరోసారి బాపట్ల, గుంటూరు జిల్లాలో ఏరియల్ సర్వే చేసిన తర్వాత సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాపట్ల మండలం జిల్లెలమూడి చేరుకున్నారు.

అక్కడ పంట నష్టం గురించి స్థానిక రైతులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పంట నష్టానికి పరిహారం చెల్లిస్తామని వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో దెబ్బ తిన్న పంట కాలువలను చూశారు. తక్షణమే వాటికి మరమత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అక్కడి నుంచి గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని రేటూరు గ్రామానికి వెళ్ళారు. అక్కడ స్థానిక రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

“ఈసారి మొదట ఎల్‌నినో కారణంగా ఇబ్బందులు వచ్చాయి. వాటి తర్వాత వరుసగా రెండు తుఫానులు (అర్నాబ్, మురుసు) విరుచుకుపడి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పంట నష్టం చూస్తుంటే నాకూ చాలా బాధ కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా నష్ట పరిహారం అందేలా చేస్తాను,” అని రైతులకు ధైర్యం చెప్పారు.

ప్రతిపక్షనేత హోదా కావాలని పట్టుబడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ప్యాలస్‌ గడప దాటలేదు. కానీ ఎన్నికలలో గెలుపును ఆస్వాదించాల్సిన ఈ సమయంలో సిఎం చంద్రబాబు నాయుడు గ్రామాలలో పర్యటిస్తూ రైతులకు ధైర్యం చెపుతున్నారు.

సాక్షాత్ ముఖ్యమంత్రి తమ వద్దకు వచ్చి తమ సమస్యలు, పంట నష్టం గురించి అడిగి తెలుసుకొని, ధైర్యం చెపుతుంటే, రైతులు ఆయనను చూసి సంతోషపడుతున్నారు. ప్రజలకు కష్టమొచ్చినప్పుడు వారి కోసం వచ్చి నిలబడేవాడే కదా అసలైన నాయకుడు?

ADVERTISEMENT
Latest Stories