నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయే ప్రతిష్టాత్మక 100వ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. సాధారణ సినిమాలకు విభిన్నంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది అన్న విషయాన్ని ఫస్ట్ లుక్ నుండే చిత్ర యూనిట్ చెప్పడం మొదలు పెట్టింది. “గౌతమీపుత్ర శాతకర్ణి” పేరుతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సామాజిక చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది పండుగ నాడు విడుదలైన “గౌతమీపుత్ర శాతకర్ణి” ఫస్ట్ లుక్ నందమూరి అభిమానుల్లో సినిమా పట్ల భారీ అంచనాలను పెంచుకునేలా చేసింది. త్వరలోనే ఈ సినిమా చిత్ర తారాగణం తదితర విషయాలను అధికారికంగా తెలియజేయనుంది.
ADVERTISEMENT





