లీక్ అయిన పిక్… ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

Balakrishna and Malineni Gopichand Movie Startedబోయపాటి శ్రీనుతో ‘హ్యాట్రిక్’ హిట్స్ అందుకుని మాంచి ఊపు మీదున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. “అఖండ” సినిమా ఇచ్చిన ఊపుతో ‘అన్ స్టాపబుల్’గా మారిన బాలయ్యను దర్శకత్వం వహించే అవకాశాన్ని గోపీచంద్ మలినేని సొంతం చేసుకున్నారు.

రవితేజతో “క్రాక్” వంటి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ తన కల నెరవేరిందంటూ షూటింగ్ లో పాల్గొన్న ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ పిక్స్ ను పోస్ట్ చేసారు. మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవం బాలకృష్ణ గారిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్న తాను, గతంలో ఎవరూ చూపించని విధంగా చూపిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

అయితే గోపీచంద్ ఇలా చెప్పారో లేదో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బాలకృష్ణ పిక్ అలా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. నల్ల చొక్కా, లుంగీతో కుర్చీలో కూర్చున్న బాలయ్య లుక్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్స్ విషయంలో బాలయ్య చేసే ప్రయోగాలు ఒక్కోసారి అభిమానులే తలలు పట్టుకునేలా ఉంటాయి.

కానీ ఈ సారి తెల్లటి గడ్డం, మంచి హెయిర్ స్టైల్ తో మాస్ కు మరింత కిక్ ఇచ్చే విధంగా నందమూరి నటసింహం కూర్చుని ఉండడం చూసి అభిమానులైతే దిల్ ఖుష్ అవుతున్నారు. తొలిరోజే సెట్స్ నుండి లీక్ అయిన ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి చిత్ర యూనిట్ చర్యలు తీసుకోవాల్సిన లీక్ అయితే కాకపోవడంతో, ఎవరూ ఈ లీక్ గురించి సీరియస్ గా తీసుకోవడం లేదు.

ADVERTISEMENT
Latest Stories