అసలు హరికృష్ణ ఎందుకు డ్రైవ్ చేయాల్సి వచ్చింది?

Nandamuri Harikrishna -Road Accidentసినీ, రాజకీయ ప్రముఖులకు ఖరీదైన వాహనాలు… ఆయా వాహనాలకు నిపుణులైన డ్రైవర్లు ఉండడం చాలా సహజం. కానీ నేడు జరిగిన యాక్సిడెంట్ లో డ్రైవర్ లేకుండా స్వయంగా హరికృష్ణ వాహనాన్ని నడపడానికి గల కారణం ఏంటి? అంటే… డ్రైవింగ్ అంటే హరికృష్ణకు ఎంతో మక్కువ అన్న సమాధానం లభిస్తోంది. ఇప్పుడే కాదు, మొదటి నుండి హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఎంతో ఆసక్తి ఉండేదట.

[m9ad]

ADVERTISEMENT

అయితే చివరికి అదే డ్రైవింగ్ హరికృష్ణను అనంతలోకాలకు తీసుకువెళ్ళింది. లారీ నుండి కారు వరకు ఎలాంటి వాహనాన్ని అయినా అత్యంత వేగంగా నడపడంలో హరికృష్ణ సిద్ధహస్తుడు. అదే విశ్వాసంతో తన ఫార్చూనర్ కారును కూడా 160 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ యాక్సిడెంట్ కు గురయ్యారు. హైదరాబాద్ నుండి నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

నాడు ఎన్టీఆర్ ను పక్కన కూర్చోపెట్టుకుని చైతన్య రధాన్ని రాష్ట్రం నలుమూలలా నడిపిన రధసారధి… నేడు అలాంటి రధాన్ని అతి వేగంతో నడుపుతూ నియంత్రించడంలో విఫలమై అశువులు బాసారు. ఉదయం 4.30 గంటలకు హైదరాబాద్ లో తన ఇంటి నుండి బయలుదేరిన హరికృష్ణ, 7.30 గంటలకు నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

ADVERTISEMENT
Latest Stories