నందమూరి హీరో ఆ గెట్ అప్ దేనికో?

Kalyan Ram -New Lookనందమూరి కళ్యాణ్ రామ్ సంక్రాంతికి విడుదలైన ఎంత మంచివాడవురా తో మరో ప్లాప్ మూటగట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన తన తదుపరి చిత్రం గురించి ప్రకటించలేదు. అయితే మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో రావణ్ అనే సోసియో ఫాంటసీ చిత్రం చేస్తున్నట్టు మొన్నా మధ్య వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

అది 13వ శతాబ్దానికి సంబంధించిన కథ అని, భారీగా సిజీ వర్క్ ఉంటుందని అన్నారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా కళ్యాణ్ రామ్ అపోలో లైఫ్ స్టూడియో జిమ్ దగ్గర కెమెరాకు చిక్కాడు. అక్కడ వర్క్ అవుట్ తరువాత బయటకు వస్తున్న కళ్యాణ్ రామ్ ని కెమెరాలలో బంధించాడు.

గుబురు జుట్టు, ఒత్తయిన గెడ్డం, మీసంతో కళ్యాణ్ రామ్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. సహజంగా ఏదైనా కొత్త గెట్ అప్ లోకి మారాల్సినప్పుడు హీరోలు ఇలా ఎక్కువగా జుట్టు పెంచుతారు. దీనితో ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గెట్ అప్ మీద ఊహాగానాలు మొదలయ్యాయి. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ మీద ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాకు కళ్యాణ్ రామ్ సహనిర్మాత. గతంలో ఆయన తమ్ముడు ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా నిర్మించారు. ఈ చిత్రం ఈ వేసవిలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా ఇదే కావడంతో దీని మీద అంచనాలు గట్టిగా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories