మొత్తానికి బయటకు వచ్చిన మోక్షజ్ఞ… నందమూరి అభిమానులకు ఊరట

Nandamuri Mokshagnaనందమూరి వంశంలో మూడోతరం హీరోగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడా?ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మొన్న ఆ మధ్య ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. నందమూరి మోక్షజ్ఞ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఈ మధ్య అతనిని చుసిన వారెవరికైనా ఆ విషయం అర్ధం అవుతుందని ఆ వార్త సారాంశం. పైగా అసలు మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తి తో ఉన్నారని కూడా వార్తలు హల్ చల్ చేశాయి.

మొత్తానికి నందమూరి వారసుడు ఈరోజు అభిమానుల కంటపడ్డాడు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరో కోసం హైదరాబాద్ వచ్చిన అభిమానులకు కార్ లో మోక్షజ్ఞ కనిపించాడు. అభిమానులకు చెయ్యి ఊపి కార్ లో వెళ్ళిపోయాడు. అయితే కొందరు అతనిని తమ కెమెరాలలో బంధించారు. మోక్షజ్ఞ ఇప్పటివరకూ పుకార్లలో ఉన్నట్టు లావుగా అందవిహీనంగా అయితే లేడు. కొంచెం లావుగా ఉన్న మాట నిజమే గానీ అదేమి సినిమాలకు పనికి రానంతగా అయితే కాదు.

ADVERTISEMENT

ఒకవేళ అతనికి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండి కష్టపడితే తొందరలోనే హీరో మెటీరియల్ గా తయారు కావొచ్చు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 24 ఏళ్లు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను మోక్షజ్ఞను ఓ కథా బలం ఉన్న సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నానని, పెద్ద పెద్ద ఫైటింగ్‌లు చేసేసి.. ప్రపంచాన్ని కాపాడే హీరో రేంజ్‌లో తెరంగేట్రం చేయబోనని ప్రకటించారు. అంటే, బాలయ్య మదిలో మోక్షజ్ఞను హీరోగా చేయాలనే తపన మాత్రం ఉన్నట్టు అర్థం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories