నందమూరి కుటుంబంలో ఈ కారు ప్రమాదాలేమిటో?

Nandamuri_Ramakrishna_Car_Accidentనందమూరి తారకరామారావు కుమారుడు, బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కారు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్: 10లో ఆయన స్వయంగా నడుపుకొంటూ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. కానీ అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయన ఆ కారుని అక్కడే వదిలేసి వేరే వాహనంలో ఇంటికి చేరుకొన్నారు. ఈ ప్రమాదంపై ఆయన కానీ మరెవరూ గానీ ఫిర్యాదు చేయనందున కేసు నమోదుచేయలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. నందమూరి రామకృష్ణ సిబ్బంది వచ్చి కారుని తీసుకుపోయారని పోలీసులు తెలిపారు.

రామకృష్ణ సోదరుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న గత నెల 27వ తేదీన గుండెపోటు రావడంతో అప్పటి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

నందమూరి కుటుంబానికి కారు ప్రమాదాలు శాపంగా మారిన్నట్లున్నాయి. నందమూరి హరికృష్ణ 2018, ఆగస్టు 29న నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు ప్రమాదంలో మరణించారు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ 2014, డిసెంబర్‌ 6వ తేదీన నల్గొండ జిల్లాలోనే కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జూ.ఎన్టీఆర్‌ కూడా 2009లో ఖమ్మంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో హైదరాబాద్‌ తిరిగివెళుతుండగా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నందమూరి రామకృష్ణ ఈ కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

ADVERTISEMENT
Latest Stories