కింగ్ నాగార్జున – నాచురల్ స్టార్ నాని జంటగా నటించిన “దేవదాస్” సినిమా ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మల్టీస్టారర్ మూవీ కావడంతో, కలెక్షన్ల పరంగా పూర్తిగా డ్రాప్ అవ్వని ఈ సినిమా అసలు పరిస్థితి తెలియాలంటే, ‘మండే టెస్ట్’ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుండి డిలిట్ చేసిన ఓ సన్నివేశాన్ని తాజాగా చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.
[m9ad]
క్లైమాక్స్ లో వచ్చే ఈ సీన్ లో మొదటి నిముషం సినిమాలో ఉంటుంది, ఆ తర్వాత నాని డోర్ వేసి రావు రమేష్ కు పీకే క్లాస్ మాత్రం ఎడిటింగ్ లో వెళ్లిపోయింది. డాక్టర్ గా తను చేసిన ట్రీట్మెంట్ ఏంటో చెప్తూ… క్లాస్ పీకిన ఈ సీన్ లో నాచురల్ స్టార్ అభినయం హైలైట్ గా నిలిచింది. ఏమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా పండించే నాని, ఈ సీన్ లో కూడా తనదైన శైలిలో చెలరేగిపోయాడు. అప్పటికే 2.44 గంటల నిడివి ఉండడంతో, ఈ మూడు నిముషాల సీన్ ను లేపేసారు.



